'బెండు అప్పారావు' రివ్యూ
గ్రామాల్లో ఉండే వివిధ రకాల వ్యక్తుల జీవన విధానం, సరదాలు, భావోద్వేగాలు, విదేశాల్లో ఉద్యోగాల ఆశతో మోసపోతుడం వంటి
అంశాలను దర్శకుడు తనదైన శైలిలో డీల్ చేస్తూనే, ఆర్థిక మాంద్యం వల్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు విదేశాల నుంచి తిరుగుటపా కడుతున్న విషయాన్ని కూడా సందర్భోచితంగా టచ్ చేశారు. అలాగే ఇవివి సినిమాల్లో ఆడ పాత్రలకు 'రంకు' అంటగడతారనే ముద్ర ఒకటి ఉంది. ఇందులోనూ అలాంటి ఒకటి రెండు పాత్రలున్నాయి. అయితే ఇదివరకటి డెప్త్ ల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. ప్రతి పాత్రకూ కామెడీ టచ్ ఇచ్చారు. అవసరమైన సెంటిమెంట్ ఉన్నా అది జస్ట్ కోటింగ్ మాత్రమే. సినిమా నడక ఎలా సాగుతుందో తేలిగ్గా ఊహించేయ వచ్చు. రొటీన్ కథే అయినా ఇవాల్టి తరం ఆడియెన్స్ కు కూడా దగ్గరయ్యేలా బలమైన సంభాషణలు, సెలక్టివ్ గానే పాటలు చొప్పించడం ద్వారా ఇవివి మరోసారి హిట్ కొట్టాలనే కసి ప్రదర్శించారు.
అల్లరి నరేష్ పూర్తి స్థాయి కామెడీ హీరోగా సింగిల్ హ్యాండ్ మీద సినిమాలు లాగించేస్తాడని మరోసారి నిరూపించుకున్నారు. చుట్టూ ఎంతమంది కమెడియన్లు ఉన్నా 'బొంగేంకాదూ' (నరేష్ చిత్రాల్లో తరచు ఉపయోగించే పదం) అంటూ గోదావరి మాండలికంలో మరో సారి ఇరగదీశాడు. నరేష్ తర్వాత చెప్పుకోదగని పాత్ర ఆహుతి ప్రసాద్ దే. గోదావరి యాసలో ఆయన విజృంభించాడు. తన ఇంటికి వచ్చిన వారిని మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ చక్కటి వినోదం అందించారు. కామ్న జెఠ్మలానీ తన పాత్రను చక్కటి ఈజ్ తో చేసింది. పాటల్లో గ్లామర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. మేఘన పాత్ర నిడివి తక్కువే. అభినయానికి అంతగా ఆస్కారం లేదు. ఓ పాటలో మంచి ఒంపు సొంపులు ప్రదర్శించింది. అల్లరి నరేష్ దగ్గర కాంపౌండర్ గా పనిచేసే గణేష్ గా సుమన్ శెట్టి, హీరో ఫ్రెండ్స్ గా శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ్, పోస్ట్ మాన్ గా కొండవలస, చాకలి తాతాజీ గా ఎల్బీ శ్రీరామ్, ఆహుతి ప్రసాద్ సైడ్ కిక్ గా రఘుబాబు, అలాగే ఆహుతి ప్రసాద్ తల్లిగా తెలంగాణ శకుంతల, దుబాయ్ శీను పాత్రలో ఆలీ, నకిలీ శంకర్ దాదాగా ధర్మవరపు సమర్ధవంతంగా కామెడీని పండించారు. చలపతిరావు, కృష్ణ భగవాన్, జీవా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. తన సినిమాల్లో తరచు ఏదో ఒక చిన్న పాత్రలో కనిపించే డాక్టర్ డి.రామానాయుడు ఇందులోనూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ఓ గెస్ట్ రోల్ హుందాగా పోషించారు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|