'బెండు అప్పారావు' రివ్యూ
సాంకేతకపరంగా సంభాషల రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రానికి పూర్తి వెన్నుదన్నుగా నిలిచారని చెప్పాలి. కనీసం ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారైనా నవ్వులు పూస్తాయి. 'పాము బుసకొట్టక ఆది సినిమాలో ఎన్టీఆర్ లా తొడగొడుతుందా', 'నీ కడుపు పండితే నాగచైతన్య పేరు పెట్టుకుంటా' (నాగేంద్రునితో చలపతిరావు), 'ఈరోజు కాకపోయినా రేపైనా నేరాలు-ఘోరాలు లో నూతనప్రసాద్ బయటపెడతారు', 'చెరుకు మిషన్ లో చేయైనా పెడతామంటున్నారు కానీ రాజుగారింట్లో కాలు పెట్టమంటున్నారు' (అతి మర్యాదల భయమన్నమాట), 'వీడు తొంగోలేదు..పున్నమినాగు తొంగోబెట్టింది', 'పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం...మీ అమ్మాయి టెన్త్ క్లాస్ పాసవడం అనుమానమే', 'గణేష్..ఎవరినీ లెక్కచేయడు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మహేష్ మాట కూడా వినడు' వంటి చతుర సంభాషణలు చాలానే ఉన్నాయి. కోటి సంగీతం అందించిన నాలుగు పాటల్లో 'ఏం చూపురా ఓరి నాయనో' పాట మెలోడి ప్రధానంగా ఆకట్టుకుంటుంది. వి.జయరాం ఫోటోగ్రఫీ ఫరవాలేదు. గౌతంరాజు ఎడిటింగ్ ఓకే. డాక్టర్ రామనాయుడు నిర్మాణ విలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
ఇవివి సినిమాల్లోని రెగ్యులర్ కమెడియన్లు (ఇద్దరి ముగ్గురు మినహా) అందరూ ఇందులో ఉండటంతో సహజంగానే నాన్ స్టాప్ కామెడీ పండింది. సినిమా ప్రథమార్థం వినోదాత్మకంగా సాగి విశ్రాంతి దగ్గర కథ బిగిసింది. సెకెండాఫ్ అంతే పట్టుగా సాగుతూ క్లైమాక్స్ పెళ్లి పీటలకు చేరుతుంది. తేలిగ్గా ఊహించగలిగిన ముగింపే అయినా అలాంటి ముగింపే సబబు అనిపించేలా దర్శకుడు సుఖాంతం చేశారు. అల్లరి నరేష్, ఆహుతి ప్రసాద్ ల నటన, సంభాషణా రచయిత పనితనం ప్రేక్షకులను ఎక్కడా బోర్ ఫీల్ కానివ్వవు. చాలాకాలం తర్వాత ఓ నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ రావడం, దీపావళి సీజన్ కావడం బెండు అప్పారావుకు కలిసొచ్చే అంశాలు. 100 శాతం వినోదం కాకపోయినా దానికి దగ్గర వరకూ 'అప్పారావు'ను ఇవివి తీసుకెళ్లారు. ఎటొచ్చీ కొద్దిగా పబ్లిసిటీ తాళింపు పెడితే దీపావళి సీజన్ దున్నేయొచ్చు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|