'ఏక్ నిరంజన్' రివ్యూ
సాంకేతికపరంగా మణిశర్మ మ్యూజిక్ హైలైట్. టైటిల్ సాంగ్ తో పాటు, 'గుండెల్లో గిటారు మోగించావే', 'సమీరా ఒక్కసారి ఐలవ్యూ అనవే చచ్చిపోతానే' పాటలు యూత్ ను ఆకట్టుకుంటాయి. మైఖేల్ జాక్సన్ స్మృత్యర్థం చేసిన పాట కూడా అలరిస్తుంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. పూరీ జగన్నాథ్ సంభాషణలు ఆయన గత చిత్రాల స్టయిల్ లోనే మాస్ అప్పీల్ తో ఉన్నాయి. 'నన్నిలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా..లేకపోతే మళ్లీ నేనే దంచెయనా', 'సింహానికి బాటిలో కత్తో తేడా ఏం తెలుస్తుంది', 'నీలాంటి వాడిని చంపితేనే నా కసి, పగ, గుల తీరుతాయి' వంటివి మచ్చుకు కొన్ని.
సినిమా ప్రథమార్థం అలరించే విధంగానే ఉన్నా ద్వితీయార్థం ఆ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కామెడీ త్రయం (బ్రహ్మీ అండ్ కో) చేసిన లేకి చేష్టల ట్రాక్ మెయిన్ థీమ్ కు కనెక్ట్ కాకపోవడం ఓ కారణం. చివర్లో బ్యాంకాక్ ఎపిసోడ్ కూడా ఆ గ్రాఫ్ ను పెంచలేకపోయింది. ప్రభాస్ నటన, సోనూసూద్ సెటైర్స్ తో కూడిన విలనీ, సంగీతం హైలైట్స్ అయితే, బ్యాడ్ టేస్ట్ తో కూడిన కామెడీ మైనస్. స్క్రిప్టులోని కీలక అంశాలపై దర్శకుడు మరింత దృష్టి సారించి ఉండాల్సింది. ఓవరాల్ గా 'ఏక్ నిరంజన్' కొంచెం వీకే...
Read 4 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|