'విలేజ్ లో వినాయకుడు'రివ్యు
కార్తీక్ (కృష్ణుడు) వృత్తిరీత్యా కిండర్ గార్డెన్ పిల్లలకు టీచర్. అతనూ, వైద్య విద్యార్థిని కావ్య (శరణ్య మోహన్) ప్రేమించుకుంటారు. కావ్య తండ్రి లక్ష్మీపతి రాజు (రావు రమేష్) ఓ రిటైర్డ్ కల్నల్. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుని తన సోదరులతో కలిసి ఉంటాడు. తల్లి లేని కావ్య అంటే అతనికి పంచప్రాణాలు. వైద్యవిద్య పూర్తి చేసుకున్న కావ్య తన తండ్రి దగ్గరకు వస్తుంది. కార్తీక్ తో తన ప్రేమ విషయం తండ్రికి ఎలా చెప్పాలా అని మదనపడుతున్న తరుణంలో ఊహించని విధంగా కార్తీక్ కూడా ఆ గ్రామానికి చేరుకుంటాడు. తన ఫ్రెండ్ గా కార్తీక్ ను కావ్య పరిచయం చేస్తుంది. సహజంగానే మిలట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో తనకు కావాలసిన అల్లుడు విషయంలో లక్ష్మీపతికి చాలా పట్టింపులు ఉంటాయి. తండ్రితో తమ ప్రేమను చెప్పడానికి కావ్య తటపటాయిస్తుంటే కార్తీక్ నేరుగా ఆ విషయాన్ని లక్ష్మీపతికి చెప్పేస్తాడు. స్థూలకాయుడైన కార్తీక్ కు తన కూతుర్ని ఇవ్వడానికి లక్ష్మీపతి ఇష్టపడడు. చిన్నప్పుడు తన కూతురు టడ్డీ బేర్ అడిగితే కొనిచ్చాననీ, ఇప్పుడు టడ్డీ బేర్ నే (కార్తీక్) చేసుకుంటానంటే ఎలా అన్నదే అతని ఆర్గ్యుమెంట్.
ఆ విషయం నేరుగా చెబితే తన కూతురు బాధపడుతుందని ఏదోవిధంగా కార్తీక్ ను బయటకు పంపేదుకు ప్రయత్నిస్తుంటాడు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు లక్ష్మీపతి స్నేహితుడు పజిల్స్ భాస్కరం (యండమూరి వీరేంద్రనాథ్) ఇందుకు సహకరిస్తూ కొన్ని ఐడియాలు ఇస్తుంటాడు. దీంతో కార్తీక్ మరింత చిక్కుల్లో పడుతుంటాడు. చివరకు అతను ఏవిధంగా లక్ష్మీపతి మెప్పు పొంది కావ్య చేయందుకున్నాడనేది మిగతా కథ.
Read 6 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|