'విలేజ్ లో వినాయకుడు'రివ్యు
చిన్న బడ్జెట్ సినిమా అయినా నిర్మాణ విలువలు, ఆర్ట్ వర్క్ రిచ్ గా ఉండటం విశేషం. కోనసీమ అందాలను మరింత అందంగా రామ్స్ తన కెమెరాలో బంధించారు. మణికాంత్ కాద్రి సంగీతం సమకూర్చిన పాటల్లో 'నీలి మేఘమా అంత వేగమా', 'చినుకై వరదై' వంటివి హమ్మింగ్ కు కూడా బాగున్నాయి. సాయికిరణ్ అడవి అడపా దడపా హాయిగా నవ్వుకునే సంభాషణలు అందించారు. 'లైఫంటే లగ్జరీలే కాదు లయబిలిటీలు కూడా ఉండాలి', 'లావుగా లేడు కాస్త బొద్దుగా ఉంటాడు' వంటి సంభాషణలు అలరిస్తాయి. మహి నిర్మాణ విలువలు మెచ్చుకోలుగా ఉన్నాయి.
అనుకున్న కథను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో దర్శకుడికి స్పష్టమైన విజన్ కనిపిస్తుంది. అయితే కథాగమనం కొద్ద పాటి స్లోగా మొదలై క్రమంగా ఊపందుకుంది. సెకెండాఫ్ దర్శకుడుగా పట్టుగా నడిపారు. మంచి థీమ్, టైటిల్ డిజైన్, ఆకట్టుకునే విజువల్స్, కథకు తగిన ఆర్టిస్టులు, సంగీత-సాహిత్య-నిర్మాణ విలువలు ఈ చిత్రానికి ప్రధాన బలం. స్కీన్ల్ పే మరింత బిగువుగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. 'చిన్న'దే అయినా చిత్తశుద్ధితో చేసిన ఈ ప్రయత్రాన్ని సకుటుంబ సమేతంగా చూసి వినోదించవచ్చు.
Read 6 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|