'ఆర్య-2' రివ్యూ
'ఆర్య' (అల్లు అర్జున్), అజయ్ (నవదీప్) చిన్ననాటి ఫ్రెండ్స్. అనాథాశ్రయంలో ఉన్న రోజుల్లోనే ఆర్య తనకొక ఫ్రెండ్ కావాలని అజయ్ ను ఎంపిక చేసుకుంటాడు. ఆర్యకు అజయ్ అంటే ప్రాణమే అయినా...అజయ్ మాత్రం బలవంతంగానే అతనితో స్నేహాన్ని కంటిన్యూ చేస్తుంటాడు. దత్తత కోసం వచ్చిన ఓ డబ్బున్న జంటకు ఇద్దర్లో ఒకరో కావాలన్నప్పుడు అజయ్ ను ఆర్య వారివెంట పంపుతాడు. అయితే ఇక్కడ అజయ్ కు 'నీవన్నీ నావే...నావన్నీ నేవే' అని మాత్రం గుర్తుంచుకోమని ఆర్య ఓ కండిషన్ పెడతాడు. అజయ్ ఓ రిజ్ బిజినెస్ మన్ అవుతాడు. మళ్లీ ఆర్య తగులుకుంటాడు. అజయ్ దగ్గరే ఉండిపోతానంటాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అజయ్ తన సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగమిస్తాడు. ఏమాత్రం చెడ్డపేరు తెచ్చుకున్నా బయటకు పంపేస్తాననే కండిషన్ పెడతాడు. దాంతో ఆర్య 'మిస్టర్ పెర్ ఫెక్ట్' అవతారమెత్తుతాడు. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా అందుకుంటాడు. ఎలాగైనా అతన్ని బయటకు గెంటేయాలనే అజయ్ ప్లాన్ బెడిసికొడుతుంది. ఆ కంపెనీలో గీత (కాజల్) అడుగుపెడుతుంది. అక్కడ్నించీ కథ మలుపు తిరుగుతుంది. అజయ్, ఆర్య ఇద్దరూ గీతను ప్రేమిస్తారు. అజయ్ కు చెందిన వన్నీ తనవే కాబట్టి గీత తనకే దక్కాలనుకుంటాడు ఆర్య. ఆమెను ప్రేమలో దింపేందుకు ట్రిక్స్ ప్రయోగిస్తుంటాడు. చివరికి అతన్ని వదిలించుకునేందుకు అతని మీద కోపంతో అజయ్ కు గీత 'ఐ లవ్ యూ' చెబుతుంది. ఇదే క్రమంలో గీతకు ఫ్యాక్షనిస్టు అయిన ఆమె తండ్రి (ముఖేష్ రుషి) మరో ఫ్యాక్షనిస్టు లీడర్ కొడుకు సుబ్బారెడ్డి (అజయ్)తో పెళ్లి కుదురుస్తాడు. దీంతో
గీత పెళ్లి చెడకొట్టి ఆమెను అజయ్ దగ్గరకు చేరుస్తానని ఆర్య ప్రామిస్ చేసి ఆ ఊళ్లోకి అడుగుపెడతాడు. ఇటు స్నేహితుడ్ని, అటు ప్రేమించిన అమ్మాయిని ఏ ఒక్కర్నీ వదులుకోవడానికి ఇష్టపడని ఆర్య తాను అనుకున్నది సాధించాడా లేదా అనేది మిగతా కథ.
Read 7 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|