'ఆర్య-2' రివ్యూ
సాంకేతక పరంగా దేవీశ్రీప్రసాద్ సంగీతం ఓ హైలైట్. 'రింగా..రింగా' గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 'పోయే పోయే లవ్వే పోయే', 'నా ఊపిరి ఆగిపోదా' వంటి పాటలు యూత్ ఫుల్ గా ఉన్నాయి. రాజశేఖర్ కెమెరా వర్క్ సినిమాకు మంచి రిచ్ నెస్ తీసుకువచ్చింది. అలాగే కొరియోగ్రఫీ కూడా మెచ్చుకోలుగా ఉంది. 'నీకు చంపేంత కోపం ఉంటే, నాకు చచ్చేటంత ప్రేమ ఉంది', 'సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో డబ్బులు కంటే జబ్బులే ఎక్కువ', 'నీమీద కోపం వచ్చినప్పుడు నాపై ప్రేమ వచ్చింది...నీపై కోపం పోయినప్పుడు నాపై ప్రేమ కూడా పోయింది' వంటి సంభాషణలు అలరిస్తాయి. ఆదిత్య రామ్, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు మెచ్చుకోలుగా ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం ఫరవాలేదనిపించుకుంటుంది. విశ్రాంతి ట్విస్ట్ ఇంట్రెస్ట్ గా ఉండటంతో పాటు మళ్లీ తెరలేవగానే రివైండ్ చేయడం బాగుంది. అయితే ద్వితీయార్థంలో ఫ్యాక్షన్ ఎపిసోడ్స్ మొదలైనప్పటి నుంచి కథలో క్యూరియాసిటీ పాళ్లు తగ్గాయి. ఆ తర్వాత వచ్చే మెయిన్ క్యారెక్టర్ లోని పాత్రలు కొంత గందరగోళం కలిగిస్తాయి. వైవాహిక సంప్రదాయాల పట్ల, తాళి పట్ల దర్శకుడికి అంతగా నమ్మకాలు లేవనే అభిప్రాయమూ కలిగిస్తుంది. అల్లు అర్జున్ కు ఉన్న 'స్టైలిష్ హీరో' ఇమేజ్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసే ప్రధానాంశాలు అయితే, ప్రధాన క్యారెక్టర్లు తీరు గందరగోళంగా ఉండటం, తగినంత కామెడీ లోపించడం, నిడివి ఎక్కువ కావడం ప్రతికూల అంశాలు. ఓవరాల్ గా ఎ సెంటర్స్, క్లాస్ ఆడియెన్స్ ను కొంతవరకూ 'ఆర్య-2' సంతృప్తిపరస్తుంది.
Read 7 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|