'ఆర్య-2' రివ్యూ
దర్శకుడు సుకుమార్ ఎక్కువ సమయం తీసుకుని చిత్రిక పట్టడం వల్లనో ఏమో కానీ ప్రధాన పాత్రధారుల క్యారెక్టరైజేషన్ లో కొంత గందరగోళం కనిపిస్తుంది. ఉదాహరణ హీరో పాత్రను తీసుకుంటే...స్నేహమే తనకు ఎక్కువంటాడు. ఇందుకోసం ప్రేమించిన అమ్మాయి మెడమీద కత్తిపెడతాడు. అజయ్ లేకుండా జీవించలేను అంటూనే గీత ఎలాంటి పరిస్థితుల్లోనూ తనకే కావాలంటాడు. దీంతో ఆ పాత్రలో 'గే' లుక్స్ కనిపిస్తాయి. ఒక్కోసారి 'సైకో'లా, ఇంకోసారి ఉన్మాదిలా, మరోసారి మనసంతా ప్రేమతో నిండిన వ్యక్తిగా కనబడటం వల్ల...అసలు ప్లాట్ లోనే గందరగోళం ఉందేమోననిపిస్తుంది. అజయ్ ను తలుచుకుని గీత మెడలో రెండు ముళ్లే వేశానంటాడు ఆర్య. ఇదేం ముచ్చటో? కాజల్ క్యారక్టర్ లోనూ అలాంటి పోకడలు కనిపిస్తాయి. కోపంతో ఆర్యకు దూరంగా ఉండేందుకు అజయ్ కు దగ్గరవుతుంది. అంటే...అతన్ని వదిలించుకోవడానికి అజయ్ వైపు మొగ్గిందనీ, నిజంగా ప్రేమించలేదని అనుకోవాల్సి వస్తుంది.అజయ్ తో ప్రేమ ముచ్చట చెప్పి తండ్రి చెప్పిన సంబంధానికి తలవంచి పెళ్లి పీటల మీద కూర్చుటుంది. ఆ పెళ్లి తప్పించిన ఆర్యతో పెళ్లికి రెడీ అయి...ఆ తర్వాత అజయ్ కు అప్పగిస్తానంటూనే అందుకు కూడా రెడీ అయిపోయింది. ఓరకంగా...ఎవరు అనునయంగా తనకు కనిపిస్తే వాళ్లవైపు మొగ్గుచూపుతుందనుకోవాలి. ఇక...విశ్రాంతి తర్వాత ఎన్ని కథలు 'సీమ' గడప తొక్కలేదు? సుకుమార్ సైతం పాత బాట పట్టారు.
నటీనటుల పరంగా అల్లు అర్జున్ పడిన కష్టం ప్రతి సీన్ లోనూ కనిపిస్తుంది. అతనిలోని ఎనర్జీ లెవల్స్ మెచ్చుకోలుగా ఉన్నాయి. ముఖ్యంగా డాన్స్ లు అదరగొట్టేశారు. హెయిర్స్ స్టయిల్ తరచు మారుతుంటుంది. అయితే ఒక్కోసారి ఆయన ముఖ కవలికలు సమంజసంగానే అనిపిస్తూనే, గందరగోళం కలిగించిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఇది దర్శకుడి బాధ్యతగానే చెప్పుకోవాలి. కాజల్ తన అందచందాలతో అలరించింది. నవదీప్ తన ఎబిలిటీస్ చూపేందుకు అవకాశం తక్కువ. ఉన్నంతలో ఫరవాలేదనిపించుకుంటాడు. శ్రద్ధదాస్ సినిమాకి కొద్దిపాటి గ్లామర్ టచ్ ఇచ్చేందుకే పనికొచ్చింది. సాఫ్ట్ వేర్ కంపెనీ హెచ్.ఆర్. కమ్ సైకియాట్రిస్ట్ దశావతారంగా బ్రహ్మానందం సినిమా ప్రథమార్థంలో అక్కడక్కడా నవ్వించారు. అజయ్ పాత్ర చిన్నదైనా చక్కగా నటించాడు. 'రింగా రింగా' సాంగ్ లో ఎరీనా సెక్సీ లుక్స్ తో ఫ్రెంట్ బెంచ్ అడియెన్స్ ను అలరిస్తుంది. మఖేష్ రుషి, సాయాజీ షిండే ఆయా పాత్రలు పరిధి మేరకు నటించారు.
Read 7 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|