'ప్రవరాఖ్యుడు' రివ్యూ
శశి (జగపతిబాబు) అమెరికాలోని హార్వార్డ్ యూనివర్శిటీలో బయాలజీ ప్రొఫెసర్ గా పనిచేసి ఆ తర్వాత సొంత ఊరు వచ్చేస్తాడు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెండు మూడు సంబంధాలు చూస్తాడు. అవేవీ అతని 'మైండ్ సెట్'కు సరిపోవు. పంట చేలో ఓ అమ్మాయిని చూసి తన మనసుకు నచ్చడంతో 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడిగేస్తాడు. 'మా ఆయన ఒప్పుకుంటే సరే' అంటుందా గడుసరి. పంటచేనులో కనిపించిన ఎంకి అతని కంటికి నచ్చడానికి ఒకప్పటి అతని క్లాస్ మేట్ కమ్ లవర్ శైలజ (ప్రియమణి) పోలికలు ఆమెలో ఉండటమే కారణమని శశి ఫ్రెండ్ రవి (సునీల్) ఓ లాజిక్ చెబుతాడు. శైలజ ఇంకా పెళ్లి చేసుకోలేదనీ, ఇప్పుడు ఆమె మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తోందనీ శశి తెలుసుకుంటాడు. శైలజ జ్ఞాపకాల్లోకి వెళ్తాడు. పదేళ్ల క్రితం శశి, శైలజ ఒకే కాలేజీలో క్లాస్ మేట్స్. శైలజ కాలేజీ బ్యూటీ. ప్రేమిస్తున్నామంటూ ఎందరో ప్రపోజ్ చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా శశికి ప్రేమ అంటే అస్సలు నమ్మకం ఉండదు. పెళ్లంటే మీల్స్ అనీ, ప్రేమ అంటే భోజనానికి ముందు తీసుకునే సూప్ అనీ అతని వాదన. భోజనం చేయడానికి సూప్ తీసుకోవాల్సిన పనిలేదంటాడు. అతని వాదన శైలజకు నచ్చదు. ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరే అయినా ఓ దశలో శశి పట్ల శైలజ అట్రాక్ట్ అవుతుంది. అయితే ప్రేమ అనే మాట ట్రాష్ అని శశి తేల్చిచెప్పడంతో అతనితో విసిగిపోయి జీవితంలో ఎప్పుడూ నాకు కనిపించకు అంటుంది. అలా ఇద్దరూ విడిపోతారు. మళ్లీ ప్రెజెంట్ లోకి వస్తే...శైలజ ప్రిన్సిపాల్ గా చేస్తున్న కాలేజీలోనే బయాలజీ లెక్చరర్ గా శశి అడుగుపెడతాడు. అతను ఆ కాలేజీనే ఎందుకు ఎంచుకున్నాడు? శైలజపై అతనిలో ప్రేమ పుట్టడమే అందుకు కారణమా? ప్రేమ పట్ల అతని ఆలోచనా ధోరణి మారిందా? చివరకు ఈ జంట కథ ఎలా సుఖాంతమయిందనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|