'ప్రవరాఖ్యుడు' రివ్యూ
దర్శకుడు మదన్ 'అనుబంధాల' గురించిన సింపుల్ కథాంశంతో కొద్దిపాటి మెసేజ్ కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజానికి ప్రేమ, పెళ్లి వంటి అంశాలకు సంబంధించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటే పిల్లల్లో ప్రేమ పట్ల సదభిప్రాయం ఉండదు. అయితే ప్రేమకు నోచుకోని పిల్లలు ఎవరు అనునయంగా మాట్లాడితే వారిపట్ల అట్రాక్ అవుతుంటారు. దీనిని ప్రేమ అనొచ్చు. అంటే ఎవరి ఎక్స్ పీరియన్స్ ను బట్టి వారి ఆలోచనా దృక్పథం ఉంటుంది. హార్మోన్ల వల్ల కలిగేదే ప్రేమనీ, హార్మోన్లు తగ్గిపోతే ప్రేమ తగ్గిపోతుందంటూ హీరో క్యారెక్టర్ తో చెప్పించారు. ఇలాంటి లాజిక్ లు కూడా ఉంటాయనుకోవాలి మరి. ప్రేమను వ్యతిరేకించిన హీరో చివరకు ప్రేమ పట్ల తన అభిప్రాయంలో మార్పు వచ్చిందని దర్శకుడు మదన్ చూపించారు. అంతవరకూ బాగానే ఉన్నా...'ప్రేమ అని చెబితే ఇంత మంచి భోజనం దొరుకుందనుకుంటే పదేళ్లు ఆగకుండా అప్పుడే ప్రేమ ఉందని చెప్పేసేవాడ్ని' అని హీరోయిన్ తో (శోభనం తర్వాత) హీరో అనడం సహేతుకం కాదు. అంటే ప్రేమ పట్ల హీరో తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు కనబడటం వంచనేనా? దర్శకుడు కప్పదాటు వేసినట్టు కనిపిస్తుంది. ఇక...కొన్ని సన్నివేశాలను దర్శకుడు అర్ధవంతంగా తెరకెక్కించారు. పెళ్లయి భర్త ఎక్కడో దూరంగా ఉండటంతో తప్పటడుగులు వేయాలని అనుకున్న ఓ లెక్చరర్ కు (హంసానందిని) జగపతిబాబు కళ్లుతెరపించే సన్నివేశం, అలాగే ఓ స్టూడెంట్ ఆయనతో 'అనుభవం' కోరుకున్నప్పుడు...నీ తల్లిదండ్రులు నీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయడం తప్పని కళ్లు తెరిపించిన సన్నివేశం, ప్రేమ దొరకలేదని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుని జగపతిబాబు కాపాడి...మంచి మాటలు చెప్పి పంపించిన సన్నివేశాన్ని దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారు. అలాగే శైలజ మనసులో ఉన్నప్పుడు శశి వేరే సంబంధాలు ఎందుకు చూశాడనే పాయింట్ ను ఎవరూ ఎత్తిచూపకుండా 'నేను అమెరికాలో ఉన్నప్పుడు నీకు పెళ్లయిందని ఎవరో చెప్పారు' అంటూ చెప్పించడం దర్శకుడు సునిశిత దృష్టికి అద్దంపడుతుంది.
జగపతిబాబుకు ఇది టైలర్ మేడ్ రోల్ కావడంతో సునాయాసంగా నటించారు. స్టూడెంట్ గెటప్ (హెయిర్ స్టయిల్ తో సహా) కొంచెం ఇబ్బంది పెట్టినా, లెక్చరర్ గా చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నారు. ప్రియమణి మరోసారి ఇటు గ్లామర్, అటు పెర్ ఫారమెన్స్ ఉన్న పాత్ర దొరకడంతో ఆ పాత్రకు చక్కటి న్యాయం చేసింది. హంసనందిని పాత్ర చిన్నదే అయినా స్టన్నింగ్ బ్యూటీ అనిపించుకుంటుంది. షరా మామాలుగానే ఆమెపై ఓ సాంగ్ తీశారు. సునీల్ తన సహజ ధోరణిలో కొద్దిపాటి నవ్వులు పంచారు. లెక్చరర్ పాత్రలో బ్రహ్మానందం, ఆఫ్రికన్ గా ఆలీ నుంచి సరైన కామెడీ రాలేదు. తెలుగు లెక్చరర్ గా నటించిన ధర్మవరపు కొద్దిసేపు నవ్వించారు. మహిళా విద్యార్థినులతో ఆయన చేయించిన ప్రతిజ్ఞ, ప్రవరాఖ్యుడు పాఠం చెప్పనంటూ మొండికేసే సన్నివేశాలు సరదాగా సాగాయి. మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|