'ప్రవరాఖ్యుడు' రివ్యూ
సాంకేతికపరంగా సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ కన్నులపండువగా ఉంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ, ఎంచుకొన్న లొకేషన్లు ఆకట్టుకుంటాయి. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అహ్లాదంగా ఉంది. 'నీలా..నీలిమబ్బు నేలకొచ్చే' పాట ప్లెజెంట్ గా ఉంది. సౌతాఫ్రికా ఎపిసోడ్, హీరోహీరోయిన్లను సింహం తరమడం కేవలం బడ్జెట్ పెరగడానికి మినహాయిస్తే పెద్దగా ప్రభావం ఉండదు. మదన్ సంభాషణలు ఫరవాలేదు. 'నమ్మకం అనేది పసిపాల లాంటిది. దాన్ని పెంచి పెద్ద చేయవచ్చు...నలిపి పారేయనూ వచ్చు', 'ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో...ఆ తర్వాత ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది' వంటి సంభాషణలు బాగున్నాయి. ఇందుకూరి గణేష్ నిర్మాణ విలువలు మెచ్చుకోలుగా ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం మదన్ తన స్క్రీన్ ప్లే పనితనంతో సరదాగా నడిపించారు. ద్వితీయార్థం కొద్దిగా సాగతీత అనిపించి, వినోదం పాళ్లు తగ్గాయి. జగపతిబాబు జంట, ఎంచుకున్న కథ ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పించే అవకాశాలున్నాయి. మాస్ ప్రేక్షకులు పాటలు సంతృప్తిపరుస్తాయి. మదన్ తీసిన 'పెళ్లయిన కొత్తలో'తో ప్రేక్షకుడు పోల్చిచూడటం సహజం కాబట్టి 'ప్రవరాఖ్యుడు' స్థాయి తక్కువే. జస్ట్ ఓకే అనుకోవచ్చు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|