'సలీమ్' రివ్యూ
దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి 'ఒక్క మగాడు' వంటి ఫెయిల్యూర్ తర్వాత కూడా సరైన స్క్రిప్టును నమ్ముకోకుండా సాంకేతక హంగులు, ఫారెన్ లొకేష్లన్ల మీదే ఆధారపడటం విస్పష్టంగా కనిపిస్తుంది. సత్య యూరప్ లోనే కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుని ఇండియాకు (తన కుటుంబ సభ్యులను చూసేందుకు) వచ్చి ఉండొచ్చు. మొదట్లో తల్లిదండ్రులు కోప్పడినా ఆ తర్వాత ఒప్పుకుని ఉండేవారు. అలాకాకుంటే ఎలాగూ ఇన్నేళ్లూ దూరంగా ఉన్న ఆమెకు వాళ్లను శాశ్వతంగా వదులుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి యూరప్ కు పారిపోవాలని అనుకోవడంలో అర్ధం లేదు. అలాగే సత్య తండ్రి కూడా జనాల్లో పలుకుబడి ఉన్నవాడే అయినా తన ప్రత్యర్థి ఎన్ని కుట్రలు పన్నినా వాటిని ఏ సందర్భంలోనూ ఎదుర్కొన్న బాపతు కాదెందుకో? అసలు దర్శకుడు లేదా కథకుడి ప్లాట్ ఏమిటనేది ముప్పాతిక సినిమా వరకూ అంతుపట్టదు. మరోవైపు ఊదరగొట్టుడు 'ఫ్లాష్ బ్యాక్'లు, సమయ సందర్భాలు లేకుండా పాటలు గుప్పించడం సహనానికి పరీక్షే.
విష్ణు బరువు తగ్గి స్లిమ్ గా కనిపించడంతో పాటు కొన్ని కాస్ట్యూమ్స్ లో స్టైలిష్ గా ఉన్నారు. సంభాషణల ఉచ్చరణలోనూ ఇంప్రూవ్ మెంట్ కనిపించింది. ఫైట్స్, డాన్స్ లు చలాకీగా చేశారు. ఇలియానా ఇంతగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేసిన సందర్భాలు గతంలో లేవు. తన గ్లామర్ లుక్స్, కాస్ట్యూమ్స్ తో కనికట్టు కట్టింది. అంతగా చదువు సంధ్యలు లేని డాన్ గా మోహన్ బాబు తన నట అనుభవాన్నంతా రంగరించి
మంచి నటన ప్రదర్శించారు. అయితే మోహన్ బాబు ఇలాంటి పాత్రను ఎంచుకోవాల్సిన అవసరం ఉందా? అది హుందాతనం అనిపించుకుంటుందా అనే ఓ ప్రశ్న తలెత్తుతుంది. పాత్ర పరంగా తనకు ఇంగ్లీషు పాఠాలు చెప్పడానికి వచ్చే టీచర్ లో ఎరోటిక్ యాంగిల్ చూస్తుంటారాయన. ఎందుకు ఈ ప్రస్తావన అంటే...శ్రీ విద్యానికేతన సంస్థలకు మోహన్ బాబు అధిపతి కూడా. సినిమాలో టీచర్ జాకెట్ ముడి విడిపోతే కట్టడం, ఓ సాంగ్ కూడా వేసుకుంటారు. కావేరీ ఝా పాత్ర గ్లామర్ ప్రదర్శనకే పరిమితమైంది. వెంకట్ నటనకు పెద్దగా స్కోప్ లేదు. నెపోలియన్, ముఖేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.కామెడీ కొరియోగ్రాఫర్ గఫర్ ఖాన్ గా ఆలీ కొద్దిగా నవ్వించారు.
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|