'సలీమ్' రివ్యూ
సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మంచి క్వాలిటీ లుక్ తీసుకువచ్చింది. సందీప్ చౌతా సంగీతం అందించిన పాటల్లో 'మామామియా' మినహాయిస్తే ఒక్కపాట కూడా జనాలకు పట్టదు. సాహిత్యాన్ని (చాలా చోట్ల అర్థమే కాదు) బీట్ డామినేట్ చేయడంతో పాటు ఒకపాట అయితే డబ్బాల్లో గుళకరాళ్ల చందంలా ఉంది. చింతపల్లి రమణ సంభాషణలు చాలామటుకు నేలబారు స్థాయిలోనే సాగాయి. పంచ్ లోపించింది. గోపి మోహన్, బివిఎస్ రవి స్క్రీన్ ప్లే సాదాసీదా వ్యవహారమే. విష్ణుకు ఆయన సతీమణి విరానికి మంచు చేసిన స్టైలింగ్ ఆకట్టుకుంటుది. డాక్టర్ ఎం.మోహన్ బాబు నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం ఇలియనా (నాభి చుట్టూ కెమెరా లెక్కలు మించి చక్కర్లు కొట్టింది) గ్లామర్ పైన, ద్వితీయార్థం మోహన్ బాబు, కావేరీ ఝా రొమాంటిక్ ఎ'ఫైర్' పైన దర్శకుడు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఒకరకంగా ఇలియానా గ్లామర్, నిర్మాణ విలువలు
ఈ చిత్రానికి సానుకూల అంశాలు. నిస్సారంగా అనిపించే సంభాషణలు, పట్టు లోపించిన స్క్రీన్ ప్లే, రొటీన్ కామెడీ, నిడివి సైతం ఎక్కువగా ఉండటం వంటివి ప్రతికూల అంశాలు. ముందే అన్నట్టు...దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం మంచిదే అయినా ప్రెజెంటేషన్ పరంగా కొత్తదనం లోపించింది. ఓవరాల్ గా...'హలీం' మింగుడు పడుతుందేమో కానీ 'సలీమ్' మింగుడుపడడు(దు). చూడాలనుకుంటే ఎవరి ఛాయెస్ వారు తీసుకోవచ్చు. అంతే!
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|