'అదుర్స్' రివ్యూ
వినాయక్ ఈ చిత్రంలో కామెడీ-యాక్షన్ మధ్య బ్యాలెన్స్ చేస్తూ కథను నడిపినప్పటికీ, ద్విపాత్రాభినయంతో వచ్చిన వచ్చిన పలు తెలుగు, హిందీ చిత్రాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అలాగే మారణాయుధాలకు సంబంధించిన క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు కొత్త కాదు. ఇన్ స్పెక్టర్ కావాలనుకున్న నరసింహ చివరకు ఆ లక్ష్యం సాధించాడా లేదా అనేది ఎందుకో ఆయన పట్టించుకోలేదు. అలాగే సాయాజీ షిండే పాత్రలోనూ నిలకడ కనిపించదు. ఒకసారి పాజిటివ్ గా, మరోసారి నెగిటివ్ గా కనిపిస్తుంది. వినాయక్ 'శంభో శివ శంభో' అనే పాటలో ఒకసారి కనిపించి నటన పట్ల తనకున్న మక్కువను కూడా చాటుకున్నారు.
ఎన్టీఆర్ మరోసారి విజృంభించి నటించారు. చారి పాత్రలో హిలేరియస్ కామెడీ పండించారు. నరసింహ పాత్ర రొటీనే. షరామామూలుగా ఆయన డాన్స్ లు ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తాయి. ముఖ్యంగా 'పిల్లా నా వల్ల కాదు' పాటకు వేసిన స్టెప్ లు 'వన్స్ మోర్' అనిపించుకుంటాయి. నయనతార సన్నగా, గ్లామర్ ఛాయలు తగ్గి కనిపిస్తుంది. ఎన్టీఆర్ కంటే ముదురుగా కనపించక మానదు.
షీలా గ్లామర్ పరంగా యూత్ ను మరోసారి ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం ఎక్కువ నిడివి ఉన్న పాత్రను సునాయాసంగా పోషించి ఈ తరహా పాత్రలు తనకు కొట్టినపిండేనని నిరూపించుకున్నారు. ఆయన ముదురు ప్రేమ, చారిపై పగ పట్టడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదం పంచుతాయి. అలాగే రఘబాబు, ఎమ్మెస్ నారాయణ, అమితాబ్ బచ్చన్ గెటప్ లో కనిపించిన కొండవలస, 'మా బావ కళ్లలో ఆనందం చూడాలి' అనే డైలాగ్ తో అనంత్ తమవంతు వినోదం పంచారు. మహేష్ మంజ్రేకర్ కామెడీ టచ్ తో చేసిన విలనీ బాగానే పోషించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|