'అదుర్స్' రివ్యూ
సాంకేతక పరంగా ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కోన వెంకట్ సంభాషణల్లో తగినన్ని కామెడీ పంచ్ లున్నాయి. 'చేప చెరువులో ఉంటే ఏముంటుంది...నోటిలో పడితే దివ్యంగా ఉంటుంది', 'పబ్ లన్నాక ఈ దెబ్బలు ఖాయం' వంటి సంభాషణలు మచ్చుకు కొన్ని. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఓకే. 'శంభో శివ శంభో', 'అదుర్స్' పాటలు బెస్ట్. సెన్సార్ సూచనల మేరకు 'వేరీజ్ దట్ పంచకట్టు..వేరీజ్ దట్ పిలక జుట్టు...వేరీజ్ దట్ నిలువు బొట్టు' లిరిక్ (రామజోగయ్య శాస్త్రి) ను....'వేరీజ్ దట్ పంచకట్టు..వేరీజ్ దట్ పాత బైక్, వేరీజ్ దట్ ఓల్డ్ లుక్..చారి'గా మార్చారు. వల్లభనేని వంశీ-కొడాలి నాని నిర్మాణ విలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం ఫరవాలేదనిపిస్తుంది. ద్వితీయార్థంలో కామెడియన్ల జోరు పెరిగి కొంచెం ఊపందుకుని రొటీన్ క్లైమాక్స్ తో తెరపడుతుంది. ఎన్టీఆర్-బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చే కామెడీ కోసం ఓసారి చూడొచ్చు. ఎన్టీఆర్ ను తెరపై చూసి చాలా కాలం కావడం, పండుగ సీజన్ కలిసొచ్చే అంశాలు. ఓవరాల్ గా...అదుర్స్ అదురుడు యావరేజే...
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|