'నమో వెంకటేశ' రివ్యూ
వెంకీ గత చిత్రాలైన 'మల్లీశ్వరి', 'అడవారి మాటలకు అర్థాలు వేరులే' ఛాయలు ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వెంకీని పెళ్లికాని ముదురుగా మళ్లీ మళ్లీ చూపించాలనుకోవడం ప్రేక్షకులు మునుముందు జీర్ణించుకోవడం కష్టమే. కాన్సెప్ట్ పరంగా చూసినా కొత్త సీసాలో పాత సారా పోసే ప్రయత్నంగానే ఈ చిత్రం సాగింది. బాటిల్ షేపు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేలా దర్శకుడు చూసుకుని ఉండాల్సింది. ఆయన గత చిత్రాలతో పోలిస్తే ఎంటర్ టైన్ మెంట్ లెవల్స్ కూడా ఓ మోతాదు తక్కువే.
వెంకటేష్ గతంలో ఈ తరహా పాత్రలు చాలా చేసి ఉండటంతో మరోసారి సునాయాసంగా తన పాత్రకు న్యాయం చేశారు. కామెడీ పరంగా కూడా తన ప్రత్యేకతను నిలుపుకొన్నారు. త్రిష గ్లామర్ పరంగా ఆకట్టుకున్నా అభినయం పరంగా చెప్పుకోదగని నటన ప్రదర్శించిన సందర్భాలు లేవు. బ్రహ్మానందం క్యారెక్టర్ బలంగా ఉండటంతో ఆ పాత్రకు ఆయన న్యాయం చేశారు. పలుచోట్ల చక్కటి నవ్వులు పండించారు. ధర్మవరపు-కాశీ విశ్వనాథ్ కాంబినేషన్ లో కొన్ని నవ్వులు జనరేట్ అయ్యాయి. సురేఖావాణి, మాస్టర్ భరత్, ఆలీ వంటి ఆర్టిస్టులు సాదాసీదాగానే మిగిలిపోయారు. ముఖేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి, కోట, సుబ్బరాజు రొటీన్ తరహాలోనే నటించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|