'నమో వెంకటేశ' రివ్యూ
సాంకేతికపరంగా ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ మెచ్చుకోలుగా ఉంది. ఫారెన్ లొకేషన్లను ఆయన కెమెరాలో మరింత అందంగా బంధించారు. చింతపల్లి రమణ సంభాషణలు బాగున్నాయి. 'ఆరోగ్య సూత్రాల విషయంలో మంతెన సత్యనారాయణగారిని ఫాలో అవుతాను', 'మీకు మేటర్ చెప్పి కొట్టాడు...నాకు మేటర్ చెప్పమని కొడుతున్నాడు', 'నా బ్లెడ్ గ్రూప్ బి పాజిటివ్ కదండీ. అందుకే ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకోవడం అలవాటైంది', 'ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు', 'అందరూ ప్రేమించగలరు...కొందరే ప్రేమను ఇవ్వగలరు' వంటి సంభాషణలు కొన్ని. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ మరింత బెటర్ గా ఉండొచ్చు. 'నమో నమో వెంకటేశ' పాట పాత్రం ఆడియెన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ విలువలు మెచ్చుకోలుగా ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా నడక సాగించి 'గెట్ రెడీ ఫర్ రియల్ గేమ్' అనే విశ్రాంతి కార్డుతో కొంత క్యూరియాసిటీని కలిగిస్తుంది. సెకెండాప్ గేమ్ సాఫీగా, ఊహించిన విధంగానే సాగుతుంది. శ్రీనువైట్ల 'ఢీ', 'రెడీ', 'కింగ్' వంటి చిత్రాలతో చూసినప్పుడు 'నమో వెంకటేశ' విషయంలో ఆయన చేసిన స్కోరింగ్ కొంత తక్కువే. ఓవరాల్ గా...సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా 'నమో వెంకటేశ'ను చెప్పుకోవచ్చు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|