'శంభో శివ శంభో' రివ్యూ
దర్శకుడు సముద్ర ఖని పూర్తి అవగాహనతో ఈ కథను తెరకెక్కించడం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రారంభంలో కథాక్రమం కొంత నెమ్మదిగా అనిపించినప్పటికీ క్రమంగా పరుగులు తీయించారు. ప్రేమజంటను కలపడమనే బలమైన ఎపిసోడ్ తో విశ్రాంతి ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు క్లైమాక్స్ నూ అంతే పట్టుగా చూపి రక్తి కట్టించారు. మరో ప్రేమజంటకు సహాయపడేందుకు మిత్ర త్రయం రెడీ అవడం ద్వారా 'సీక్వెల్'కూ ఛాన్స్ ఉందనే ఫీలర్ ను దర్శకుడు వదిలారు. కర్ణను మరిచిపోకుంటే చచ్చిపోతానని మణెమ్మ తండ్రి ఆత్మహత్యా యత్నం చేసే ఘట్టం, అప్పుడు మణెమ్మ పడే ఆవేదన దర్శకుడు హృద్యంగా చిత్రీకరించారు. అలాగే తండ్రి చీవాట్లు పెడుతుంటే 'నాకు వినపడదు...నేను నీకొడుకుని కాదనే కదా నువ్వు తిడుతున్నావు. నేనే వెళ్లిపోతున్నాను' అంటూ మల్లి అతనితో చెప్పే ఘట్టం, మణెమ్మకు వేరే పెళ్లి ఖాయం చేశారని తెలిసి ఆమె తండ్రిపై మల్లి వీరంగం చేయడం వంటి సన్నివేశాలనూ దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారు. ముగ్గురు మిత్రుల్లో ఏ ఒక్క పాత్రకూ శుభం కార్డు వేయకపోవడం దర్శకుడు అనుకుని చేసినదే కావచ్చు.
మంచి పాత్రలు దొరికితే ఏ నటుడైనా విజృంభిస్తాడని చెప్పడానికి రవితేజ, అల్లరి నరేష్ పాత్రలను చెప్పుకోవాలి. రవితేజ తన నటనలోని పైర్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. స్నేహితుని ప్రేమని నెగ్గించి తన ప్రేమను మాత్రం దక్కించుకోలేకపోయిన త్యాగమయ పాత్రను సమర్ధవంతంగా ఆయన పోషించారు. మొదట్నించీ చివరి వరరూ గడ్డం, చెదిరిన క్రాఫ్ తో కనిపించిన అల్లరి నరేష్ తన పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన పాత్రలో కామెడీ ప్లస్ ఫైర్ రెండూ ఉన్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే అల్లరి నరేష్ అనే వ్యక్తి కాకుండా అతని పాత్రే కనిపిస్తుంది. 'గమ్యం' తర్వాత మరో అవార్డును ఆయన ఖాయం చేసుకున్నట్టే. రవితేజ-అల్లరి నరేష్ పాత్రల డామినేషన్ మధ్య శివ బాలాజీ సైతం తన ఉనికిని బలంగా చాటుకుంటూ తన పాత్రకు చక్కటి న్యాయం చేశారు. బావను అమితంగా ప్రేమించే మరదలి పాత్రలో ప్రియమణి మంచి అభినయం ప్రదర్శిచింది. అభినయ పాత్ర చిన్నదే అయినా చాలా క్యూట్ గా కనపించి అలరించింది. ప్రచారాన్ని అమితంగా ఇష్టపడే ప్రజాబంధు చిట్టినాయుడు పాత్రలో కృష్ణ భగవాన్ అడపాదడపా నవ్వించారు. మఖేష్ రుషి, రోజా, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, కృష్ణ భగవాన్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మిత్ర త్రయం స్నేహితుడు నానిగా సునీల్ సైతం తనదైన శైలిలో కొంత హాస్యాన్ని అందించారు.
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|