సాంకేతికపరంగా జి.ముట్టయ్య ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సుందర్ సి.బాబు స్వరపరచని పాటల్లో రెండు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ మెలోడి ప్రధానంగా ఫరవాలేదనిపిస్తాయి. సినిమా థీమ్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వెన్నుదన్నుగా నిలిచింది. శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు మరింత పదునుగా ఉండొచ్చు. 'ఫ్యాక్షనిస్టులతో యాక్షన్ వద్దు', 'బక్క వెదవా జీ ముయ్' అనే తరహాలో సంభాషణలు సాగాయి. కమర్షియల్ సక్సెస్ లు నిర్మాత బెల్లంకొండకు కొత్త కాకపోయినా కేవలం అభిరుచితో ఇలాంటి కథాంశాన్ని ఎంచుకున్నట్టు చెప్పవచ్చు. నిర్మాణ విలువలు కూడా తగనట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం..ద్వితీయార్థం అనే తేడా లేకుండా దర్శకుడు స్టోరీ బేస్డ్ గా సినిమాను నడిపించారు. అయితే ఒక్కోసారి కథ స్లో అయిందనిపించి...మళ్లీ వేగం పుంజుకోవడం కనిపిస్తుంది. అయినప్పటికీ సినిమాలో ప్రేక్షకుడ్ని పూర్తిగా ఇన్ వాల్స్ చేయడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడు. ఈ తరహా సినిమాలు జనాలకు చేరడం ఒంకిత స్లో అయినా...మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే ఇక విజృంభణకు అడ్డుండదు. ఓవరాల్ గా... కొన్ని సినిమాలు పర్స్ బరువును బట్టి చూడొచ్చు. మరికొన్ని మనసుతో...మనసుపెట్టి...సమయం తీరిక చేసుకుని చూడాల్సి ఉంటుంది. 'శంభో శివ శంభో' నిశ్చయంగా రెండో కేటగిరిలోకి వస్తుంది.