'కేడి' రివ్యూ
సాంకేతికపరంగా సర్వేస్ మురారి సినిమాటోగ్రఫీ మెచ్చుకోలుగా ఉంది. శ్రవణ్ ఎడిటింగ్ లో రెండు సార్లు జంప్ లు కనిపించాయి. ఇవాల్టి ట్రెండ్ కు దగ్గరగానే సందీప్ చౌతా సంగీతం ఉన్నప్పటికీ గత చిత్రాల కంటే స్థాయి తగ్గింది. 'మాయగాడురా ఈ మాయామశ్చీంద్ర' సాంగ్ హైలైట్. 'ము..మ్ము...ముద్దంటే' రీమిక్స్ ఫరవాలేదనిపించుకుంటుంది. కిరణ్ సంభాషణల్లో పదును తక్కువే. 'ఒక నిమిషం కోపమొస్తే ఒక నిమిషం సంతోషం పోయినట్టే', 'మోసపోయే వాడు మూర్ఖుడు...మోసం చేసే వాడు మోనార్క్' అనే తరహాలో సాగాయి. 'నావంటి పిచ్చి పూ...ఇంతవరకూ తగిలి ఉండడు కదూ' (నాగార్జునతో సాయాజీ) చాలా అతిగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ (సమర్పణ), కామాక్షి కళా మూవీస్ శివప్రసాద్ రెడ్డి నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం, ద్వితీయార్థం అనే తేడా లేకుండా ముప్పాతిక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కావడం, లెక్కకు మించిన ట్విస్ట్ లు మాస్ ను అయోమయంలోకి నెట్టేస్తాయి. అలాగే లవ్, సెంటిమెంట్ అంశాలు కూడా సరైన మోతాదులో లేకపోవడం వల్ల క్లాస్ కి కనెక్ట్ కావడం కూడా కష్టమే. నాగార్జున నటన, రకరకాల వేషాల్లో కనిపించడం, అంకుర్ విలనీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. నెవర్ ఎండింగ్ స్టోరీ తరహాలో ప్రొలాంగ్ట్ ఫ్లాష్ బ్యాక్ లు అసహనానికి గురిచేసే అంశం. ఓవరాల్ గా...'కేడి' అంచనాలను పెంచి ఆ అంచనాలను నిలబెట్టుకోవడంలో మాత్రం వెన్నుచూపింది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|