'లీడర్' రివ్యూ
ముఖ్యమంత్రి సంజీవయ్య (సుమన్) ఒక బాంబ్ బ్లాస్ట్ లో తీవ్రంగా గాయపడతాడు. అతని తనయుడు అర్జున్ ప్రసాద్ (రానా) అమెరికా నుంచి తిరిగి వస్తాడు. రాష్ట్రానికి నువ్వే సిఎం కావాలని అర్జున్ ను చివరి కోరిక కోరి సంజీవయ్య కన్నుమూస్తాడు. సంజీవయ్య హత్యకు కుట్ర పన్నింది అదే పార్టీలో ఎమ్మెల్యే గా ఉన్న తన కజిన్ ధనుంజయ్ (సుబ్బరాజు) అని అర్జున్ తెలుసుకుంటాడు. క్రిమినల్, అవినీతిపరుడైన ధనుంజయ్ అప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలను డబ్బు ఎరచూపి తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతాడు. దీనికి పార్టీ పెద్దాయనగా చెప్పుకునే ధనుంజయ్ పెదనాన్న (కోట) కూడా వంత పాడతాడు. తన తండ్రి సంజీవయ్యకు రాజకీయాల్లో మార్పు తేవాలనే కోరిక ఉన్నప్పటికీ చివరికి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి స్వార్థపరుడుగా, అవినీతి పరుడుగా మారి కోట్లాది రూపాయలు ఆర్జించినట్టు అర్జున్ తెలుసుకుంటాడు. తన తండ్రి చేయలేని పని తాను చేయాలంటే సిఎం కావడమే ఎకైక మార్గమని అర్జున్ భావిస్తాడు. అతని తల్లి (సుహాసిని) కోరిక కూడా ఇదే కావడంతో అర్జున్ తన గేమ్ ప్లాన్ మొదలుపెడతాడు. ధనుంజయ్ ను తన తెలివితేటల తోనే ఎదుర్కొని ముఖ్యమంత్రి అవుతాడు. వెంటనే 'అక్రమార్కుల'పై కొరడా ఝలిపిస్తాడు. లక్ష కోట్ల బ్లాక్ మనీని వెలికితీసి వాటిని మళ్లీ ప్రజలకే ఉపయోగించాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ప్రభుత్వ యంత్రాంగ్రాన్ని పరుగులు పెట్టిస్తాడు. ఈ చర్య అవినీతి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కంటగింపు అవుతుంది. వారి అండతో అర్జున్ ను గద్దె దింపేందుకు ధనుంజయ్ వేసే ఎత్తులను అతను ఎలా తిప్పికొట్టాడు? తన ఆశయాన్ని సిద్ధించుకుని ఎలా లీడర్ అనిపించుకున్నాడనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|