'లీడర్' రివ్యూ
నేరమయ రాజకీయాలు, హీరో తన తెలివితేటలతో వ్యవస్థను మార్చాలనుకునే కాన్సెప్ట్ తో చాలా సినిమాలో ఇప్పటి వరకూ వచ్చాయి. ఒకరోజు ముఖ్యమంత్రి కథతో 'ఒకే ఒక్కడు' మనకు తెలుసు. అవినీతి రాజకీయనాయకులు, ఆఫీసర్లపై దాడులు చేసే కథాంశంతో 'శివాజీ', 'మల్లన్న' వచ్చాయి. వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకునే 'ఠాగూర్' కూడా జనాలకు తెలుసు. శేఖర్ కమ్ముల సైతం ఇప్పుడు ఇదే లైన్స్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే ప్రయత్నాన్నినిబద్ధతతో చేశారని చొప్పొచ్చు. అలాగే ఒక సీరియస్ పొలిటికల్ డ్రామాకు ఎస్టాబ్లిష్డ్ స్టార్ హీరోని కాకుండా రానా వంటి కొత్త ఫేస్ ను పరిచయం చేయాలనుకోవడం కూడా సాహసోపేతమైన నిర్ణయం. ఎంచుకున్న కథకు న్యాయం చేయడం కోవడం కమర్షియల్ మసాలాల జోలికి వెళ్లకుండా ఇంటర్వెల్ వరకూ శేఖర్ కమ్ముల కథను నడిపినప్పటికీ అక్కడ్నించీ దర్శకుడు తన ట్రాక్ మార్చడం కనిపిస్తుంది. హీరో సీరియస్ పాత్రకు రొమాంటిక్ యాంగిల్ కథలో సింక్ కాదు. ఉదాహరణకు లుంబినీ పార్క్ లో బాంబ్ బ్లాస్ట్ అనంతరం ముఖ్యమంత్రి (రానా) పెద్దాయనను కలుసుకునేందుకు తన గాళ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లి మార్గమధ్యంలో ఆమెతో రొమాన్స్ చేయడం, కారులో ఆమె భుజంపై వాలిపోవడం వంటివి సిల్లీగా అనిపిస్తాయి. ముఖ్యమంత్రి పదవి నిలుపుకోవడం కోసం ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో అడ్డుపెట్టుకోవడం హీరో క్యారెక్టరైజేషన్ ను తగ్గించి చూపడమే అవుతుంది. ఆమెతో ప్రేమ నాటకం ఆడటం పట్ల హీరో పశ్చాత్తాప పడి ఉండొచ్చు. పదవి, పదవితో ముడిపడిన లక్ష్యం కోసం ఓ అడపిల్లను పణంగా పెట్టడం ఏరకంగా చూసినా సబబుగా తోచదు. పైపెచ్చు ఇదే వ్యక్తి (హీరో కమ్ సిఎం) చివర్లో ఒక ఆడపిల్ల మానప్రాణాలను బలిగొన్ని ఓ కామపిశాచిని కాల్చేయడమంటూ ఆదేశిస్తాడు.
రానాకు ఇది తొలిచిత్రమే ఆయినా చాలా కాన్ఫిడెంట్ గా నటించారు. యువ సిఎంగా ఎంతో హుందాగా కనిపించారు. ఆరడుగుల హైట్ కూడా ఆయనకో అడ్వాంటేజ్ అయింది. ఉచ్ఛరణలో కూడా పెద్దగా దోషాలు లేవు. అయితే వివిధ హావభావాల ప్రదర్శనలో ఇంకా ఆయన నేర్చుకోవాల్సింది, ప్రదర్శించాల్సింది చాలా ఉంది. ఫైట్స్, డాన్స్ లలో ఎలాంటి ప్రతిభ చూపిస్తాడనేది కూడా ఆయన ఫ్యూచర్ ఫిల్మ్స్ లో చూడాల్సిందే. సినిమా సెకెండాఫ్ లో రిచా గంగోపాధ్యాయ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన ఉనికిని ఆమె చాటుకుంది. కొన్ని యాంగిల్స్ లో ప్రియాంక చోప్రా, మరికొన్ని యాంగిల్స్ లో మీనాను తలపించింది. హీరోని ఇష్టపడే అమ్మాయిగా ప్రియారామన్ క్యూట్ గా ఉన్నప్పటికీ ఆమె పాత్ర సినిమా నిడివి పెంచుకోవడానికే పనికొచ్చింది. సుబ్బరాజు సీరియస్ విలనీతోనూ, కోట రాజకీయ చాణక్యుడిగానూ తన పాత్రలకు న్యాయం చేశారు. రావు రమేష్ కూడా తన ఉనికిని చాటుకున్నారు. హర్షవర్దన్ చక్కగా నటించాడు. సుహాసిని, సుమన్, ఆహుతి ప్రసాద్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఓ ఐటెం సాంగ్ లో ఉదయభాను నర్తించింది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|