'లీడర్' రివ్యూ
సాంకేతిక పరంగా మిక్కీ జె.మేయర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తగినతం బలం చేకూర్చింది. 'ఏయ్ సిఎం' అనే ఒక డ్యూయెట్ మినహాయిస్తే మిగతావన్నీ బ్యాక్ గ్రౌండ్ సాంగ్సే. వీటిల్లో 'వందేమాతరం' అనే ట్యూన్ బాగుంది. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ పనితనం యావరేజ్. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ లో క్రిస్ప్ తగ్గింది. పొలిటికల్ చిత్రాల్లో సంభాషణల పదను ఉండాలి. శేఖర్ సంభాషణలు సందర్భోచితంగానే ఉన్నప్పటికీ ప్రేక్షకుల చేతులకు పనికల్పించే (చప్పట్లు కొట్టించే) సంభాషణలు కనిపించవు. 'ముఖ్యమంత్రి బలహీనంగా ఉంటేనే అన్ని పదవులు వస్తాయి..అన్ని పనులు జరుగుతాయి', 'వీడు సామాన్యుడు కాడు. వీడిలో ఏదో ఉంది. దేశాన్ని మొత్తం మార్చేస్తాడు' వంటి సాదాసీదా సంభాషణలకే ఆయన కలం పరిమితమైంది. పద్మశ్రీ తోట తరణి ఆర్ట్ వర్క్ ఫరవాలేదు. నిర్మాణపరంగా ఏవియం సంస్థ రాజీపడలేదని చెప్పొచ్చు.
శేఖర్ కమ్ముల ఎక్కడ కథ మొదలుపెట్టాలనుకున్నారో అక్కడే మొదలుపెట్టి క్రమంగా పొలిటికల్ డ్రామాలో సీరియస్ నెస్ పెంచుకుంటూ వెళ్లడం ప్రథమార్థంలో కనిపిస్తుంది. ఇందుకు ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఉపకరించింది. అయితే సెకెండాఫ్ కు వచ్చేసరికి శేఖర్ యూత్ ఆడియెన్స్ కోసం అన్నట్టు ట్రాక్ మార్చి సీరియస్ హీరోకి మెయిన్ హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ చొప్పించడంతో అది కథకు కనెక్ట్ కాని పరిస్థితి ఏర్పడింది. హీరో సిఎంగా రిజైన్ చేసి మళ్లీ ఎన్నికల్లో నిలబడటం...ఓపెన్ ఆడిటోరియంలో జనం ముందు మళ్లీ సిఎంగా ప్రమాణం చేయడం వంటివి హడావిడిగా చుట్టేశారు. కుల, అవినీతి రహతి రాజకీయాలు ఇవాళ్టి సమాజానికి అవసరమంటూ శేఖర్ కమ్ముల చేసిన ప్రయత్నం అభినందనీయమే అయినా, 'థాట్ ప్రపోకింగ్' ఫిల్మ్ అనిపించుకోవడానికి తగింత టెంపో లోపించింది. వెరసి...'లీడర్' వీక్కే...
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|