'ఏమాయ చేసావె' రివ్యూ
కార్తీక్ (నాగచైతన్య) 22 ఏళ్ల యువకుడు. ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. సినిమా దర్శకుడు కావాలనేది అతని లక్ష్యం. కార్తీక్ తమ ఇంటి ఓనర్ కూతురైన జెస్సీ (సమంత)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కార్తీక్ కంటే జెస్సీ రెండేళ్లు పెద్ద. ఆమె మలయాళి క్రిస్టియన్. ఆమెతో కొద్దిపాటి పరిచయంలోనే కార్తీక్ లవ్ ప్రపోజ్ చేస్తాడు. కార్తీక్ కంటే తాను రెండేళ్లు పెద్ద అనీ, అదీగాక కార్తీక్ హిందూ, తాను క్రిస్టియన్ అనీ, తన తండ్రి మతాంతర వివాహానికి ఎంత మాత్రం ఒప్పుకోడని చెబుతూ ఆతని ప్రపోజల్ ను తోసిపుచ్చుతుంది. ఆ తర్వాత నుంచీ ఆమె కనిపించదు. ఆమె కేరళలోని అలెప్పీ వెళ్లిందని తెలుసుకుని కార్తీక్ తన ఫ్రెండ్ కృష్ణ (కృష్ణుడు)తో కలిసి అక్కడకు వెళ్తాడు. జెస్సీని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రేమ మాట పక్కన పెట్టి ఫ్రెండ్స్ గా ఉందామంటుంది జెస్సీ. క్రమంగా వాళ్ల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఒక సందర్భంలో జెస్సీ అన్నయ్యతో కార్తీక్ గొడవ పడటంతో వీరి ప్రేమ వ్యవహారంలో అడ్డంకులు ఎదురవుతాయి. జెస్సీకి ఓ క్రిస్టియన్ యువడికితో పెద్దవాళ్లు పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది? జెస్సీ-కార్తీక్ ల ప్రేమకథ ఏ తీరానికి చేరింది? దర్శకుడు కావాలనుకున్న కార్తీక్ లక్ష్యం ఎలా నెరవేరిందనేది మిగతా కథ.
Read 5 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|