'ఏమాయ చేసావె' రివ్యూ
జెస్సీకి క్రిష్టియన్ సంప్రదాయం ప్రకారం చర్చిలో జరుగుతున్న పెళ్లికి కార్తీక్ హాజరాకావడమనే సన్నివేశంతో గౌతమ్ కథను ప్రారంభించి మరీ సాగ తీయకుండా విశ్రాంతి సమయానికే మళ్లీ వెనక్కి వచ్చి ఇచ్చిన ట్విస్ట్ ఆయనకు సినిమాపై ఉన్న పట్టును చెబుతుంది. చాలాకాలం తర్వాత ఓ అందమైన రిఫ్రెషింగ్ లవ్ స్టోరీని నేచురల్ గా చూపించడంలో దర్శకుడు తన అనుభవాన్నంతా రంగరించారని చెప్పొచ్చు. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య నడిపిన ట్రైన్ ఎపిసోడ్, చివర్లో న్యూయార్క్ లో ఈ ఇద్దరూ కలుసుకున్నప్పటి ఎపిసోడ్ కు దర్శకుడు మార్వలెస్ ట్రీట్ మెంట్ ఇవ్వడం ద్వారా ఇది డైరెక్టర్స్ మూవీ అని చాటుకున్నారు.
నాగచైతన్య ముందు సినిమా వెనక...వెనక సినిమా ముందు చేశాడని చెప్పొచ్చు. నిజానికి తొలి చిత్రం యాక్షన్ స్టోరీ కాకుండా లవ్ స్టోరీనే ఎంచుకుని ఉండాల్సింది. ఇదీ ఒకందుకు మంచిదేనేమో. కెమెరాను ఎదుర్కొన్న తొలి అనుభవం మలి సినిమాకి ఉపయోగించింది. వయసుకు తగ్గ పాత్రను చాలా సహజంగా నాగచైతన్య ఇందులో పోషించారు. ప్రేమఘట్టాల్లో చక్కగా రాణించినప్పటికీ బాధ, ఆక్రోషం వంటివి ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఫేషియల్ ఎక్స్ ప్రిషన్స్ లో మరింత పరిణతి సాధించాల్సి ఉంది. నాగచైతన్య ముఖంలోని లేత ఛాయలు అలాగే ఉన్నందున మరిన్ని ప్రేమకథా ఇతివృత్తాల్లో నటించి తన పొజిషన్ ను పటిష్టం చేసుకోవచ్చు. సమంత 'స్టీల్ ద షో' అని చెప్పడానికి తడుముకోనవసరం లేదు. తన అందంతో, చక్కటి ఫేషియల్ ఎక్స్ ప్రిషన్స్ తో ఆకట్టుకుంటుంది. కమలిని ముఖర్జీ పోలికలు కనిపిస్తాయి. నాగచైతన్య-సమంత మధ్య చాలా చక్కటి కెమిస్ట్రీ పండింది. వీరిద్దరి మధ్య అరడజనుకు పైగా 'లిక్ కిస్' ఘట్టాలున్నాయి. అయితే వీటిని ఆయా సందర్భాలకు అనుగుణంగా దర్శకుడు తీయడంతో ఎక్కడా ఎబ్బెట్లు అనిపించింది. సమంత మునుముందు మంచి సినిమాలు సెలక్ట్ చేసుకుంటే టాలీవుడ్ లో మంచి పొజిషన్ కు వెళ్లొచ్చు. ఆమెకు సింగర్ చిన్మయ చెప్పిన డబ్బింగ్ అతికినట్టు సరిపోయింది. కృష్ణుడు తన పాత్రకు న్యాయం చేశారు. తన సంభాషణలతో అడపాదడపా నవ్వించారు. నాగచైతన్య తండ్రిగా సంజయ్ స్వరూప్ (చిత్ర నిర్మాత), తల్లిగా సురేఖ వాణి, సమంత తండ్రిగా దేవన్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఓ చిన్న పాత్రను పోషించగా, గౌతమ్ మీనన్ సైతం ఓ సన్నివేశంలో కనిపించారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ 'విన్నతాండి వరువాయ'లో ప్రధాన జంటగా నటించిన శింబు, త్రిష ఇందులో గెస్ట్ రోల్స్ పోషించడం విశేషం.
Read 5 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|