'ఏమాయ చేసావె' రివ్యూ
ప్రేమకథకు సాంకేతిక బలం అవసరం. మనోజ్ పరమహంస తన కెమెరా ప్రతిభతో విజువల్ ఫీస్ట్ చేశారు. కేరళ తీరప్రాంతం, హైద్రాబాద్, న్యూయార్క్ అందాలను ఎంతో చక్కగా తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం రిచ్ గా ఉండడానికి కళా దర్శకుడు రాజీవ్ పనితనం కూడా తోడైంది. అకాడమీ, గ్రామీ అవార్డ్స్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సినిమా మూడ్ కు తగ్గట్టు మంచి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. 'ఈ హృదయం కరిగించి వెళ్లకే', 'కుందనపు బొమ్మా' పాటలు గుర్తుండిపోతాయి. ఆంటోని ఎడిటింగ్, హీరోయిన్ కు నళిని శ్రీరామ్ చేసిన కాస్ట్యూమ్స్ డిజైనింగ్ ఆకట్టుకుంటాయి. ఉమర్జీ అనూరాధ సంభాషణలు సందర్భోచితంగా ఉన్నప్పటికీ ఆంగ్ల పదాలు విరివిగా దొర్లాయి. 'అసిస్టెంట్ డైరెక్టర్ అంటున్నావు. చూస్తే హీరోలా ఉన్నాడు...మళ్లీ హీరో అంటాడేమో' (నాగచైతన్యను ఉద్దేశించి పూరీ జగన్నాథ్), 'ప్రామిస్ లు చేసేది బ్రేక్ చేయడానికే' (సమంతతో నాగచైతన్య), 'మహేష్ తో గౌతమ్ మీనన్ సినిమానా? మహేష్ కు ఇంకెవరూ దొరకలేదా? గౌతమ్ సినిమా తియ్యాలంటే రెండేళ్లు తీసుకుంటాడు' (నాగచైతన్యతో కృష్ణుడు), 'నీకంటే రెండేళ్లు పెద్దా? అయితే తల్లిలా...భర్తలా డ్యూయల్ రోల్ పోషిస్తుంది' (నాగచైతన్యతో కృష్ణుడు) వంటి సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తాయి. నిర్మాతలు సంజయ్ స్వరూప్, మంజుల దంపతులు చక్కటి నిర్మాణ విలువలు పాటించారు.
సినిమా ప్రథమార్థం కంటే సెకెండాఫ్ లో దర్శకుడు పూర్తి పట్టు సాధించారు. క్లైమాక్స్ ప్రేక్షకులు ఊహించగలిగిందే అయినా చక్కటి ట్రీట్ మెంట్ తో కనికట్టు కట్టారు. స్టోరీ కొత్తది కాకపోవచ్చు కానీ దానిని క్లాస్ టచ్ తో దర్శకుడు ప్రెజెంట్ చేసిన తీరు కొత్తగా ఉంటుంది. ప్రేమలో పడిన వారు, ఒకింత రొమాన్స్ టేస్ట్ చేసిన వారు గౌతమ్ 'మాయ'లో పడతారు. హీరోహీరోయిన్ల మధ్య లవ్ కెమెస్ట్రీ, హార్ట్ టచ్ చేసే సన్నివేశాలు, సాంగ్స్, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. సినిమా హాల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని 'ఫీల్ గుడ్' సన్నివేశాలు ప్రేక్షకులను వెన్నంటుతాయి. మాస్ కు నచ్చే ఇంగ్రేడియంట్స్ ఇందులో లేకపోయినా, 25 ప్లస్ యూత్ కూ,క్లాస్ ప్రేక్షకులకూ 'ఏమాయ చేసావే' కనికట్టు కట్టడం ఖాయం. దిసీస్ ప్యూర్లీ ఎ గౌతమ్ ఫిల్మ్. ఎంజాయ్ చేయొచ్చు...
Read 5 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|