|
|
Articles: TP Special | శ్రీ విరోధి నామ పంచాంగం - Site Administrator
| |
శ్రీ విరోధి నామ సంవత్సరానికి రాజు శుక్రుడు. మంత్రి కుజుడు. సైన్యాధిపతి చంద్రుడు. సస్యాధిపతి శుక్రుడు. ధాన్యాధిపతి బుధుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు. మేఘాధిపతి చంద్రుడు. రసాధిపతి రవి. నీరసాధిపతి గురుడు. నవ నాయకులలో ఏడుగురు శుభులు కాగా, రసాధిపతి రవి, మంత్రి కుజులు పాపులు. రాజకీయాలలో అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్రాలలో చిత్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. రాజు శుక్రుడు, సైన్యాధిపతి చంద్రుడు కావడం వల్ల ప్రభుత్వ మార్పుల విషయంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. రాజకీయ నాయకులు ప్రజాదరణ కోల్పోతారు. వృద్ధ నేతలకు గడ్డుకాలం. కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొంటాయి. అధికారంలో స్త్రీలకు అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ప్రజాసమస్యలు క్లిష్టంగా మారతాయి. నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరుగుతాయి. పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ప్రజల మధ్య అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. ఇరుగు పొరుగు దేశాలతో తరచూ విరోధాలు. ఉత్తర, వాయవ్య, తూర్పు ప్రాంతాలలో అలజడులు, ప్రకృతి బీభత్సాలు జరిగే అవకాశం. ఐటి రంగం, నిర్మాణ రంగాలు పుంజుకుంటాయి. బంగారం, వెండి, ఇనుము, సిమెంటు ధరలు మరింతగా పెరుగుతాయి.
ఏడాది ప్రారంభంలో ధరలు కొద్దిగా అదుపులోకి వచ్చినా తిరిగి పెరుగుతాయి. వర్షాలు బాగానే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు ఉధృతం కాగల అవకాశాలున్నాయి.
పశు నాయకుడు గోపాలుడు (కృష్ణుడు) కావడంతో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. పశుపాలకుడు కూడా శ్రీకృష్ణుడే కావడం వల్ల సుభిక్షంగా ఉంటుంది.
పుష్య శుద్ధ తదియ శనివారం అనగా 19-12-2009 తేదీ రాత్రి గురుడు కుంభరాశిలో ప్రవేశంతో సింధూనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి.
ప్రజల మధ్య శత్రు ప్రభావం పెరుగుతుంది. రాజకీయ వైషమ్యాలు పెరుగుతాయి. రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు కూడా అధికం. కళాకారులు, రాజకీయాలలో కీలకపాత్ర పోషించే అవకాశముంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి బాగా కలిసివస్తుంది.
రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం : రవి ఆరుద్ర నక్షత్రంలో 22-6-2009 జ్యేష్ఠ బహుళ అమావాస్య సోమవారం రాత్రి 11-18 గంటలకు, మార్గశిర నక్షత్రంలో ప్రవేశం వల్ల అనుకూలంగా వర్షాలు ఉంటాయి. బహుళ అమావాస్య కావడం వల్ల పంటలకు కొంత నష్టం.
శుక్రమూఢమి : చైత్రశుద్ధ షష్ఠి బుధవారం అనగా 1-4-2009 తేదీ శుక్రమూఢమి త్యాగం.
మార్గశిర శుద్ధ పౌర్ణమి బుధవారం అనగా 2-12-2009 తేదీ శుక్రమూఢమి ప్రారంభం.
పాల్గుణ శుద్ధ చవితి గురువారం అనగా 18-2-2010 తేదీ శుక్రమూఢమి ఆఖరు.
గురు మూఢమి : ఫాల్గుణ శుద్ధ విదియ మంగళవారం అనగా 16-2-2010 తేదీన గురుమూఢమి ప్రారంభం.
శ్రీ వికృతి నామ సంవత్సర చైత్ర శుద్ధ చవితి శుక్రవారం అనగా 19-3-2010 గురుమూఢమి ఆఖరు.
మకర సంక్రమణం : శ్రీ విరోధి నామ సంవత్సర పుష్య బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య గురువారం ఉత్తరాషాఢ రెండవ పాదం, మకర రాశిలో సా.5-32 గంటలకు (14-1-2010) రవి ప్రవేశంతో మకర సంక్రమణ పర్వదినం.
మేష సంక్రమణం : శ్రీ విరోధి నామ సంవత్సర చైత్ర బహుళ చవితి సోమవారం అనగా 13-4-2009 తేదీ తెల్లవారు ఝామున 2-10 గంటలకు రవి ఉచ్ఛ రాశి అయిన మేషంలో ప్రవేశిస్తాడు. ఈ రోజు మేష సంక్రమణం.
గ్రహణాలు
సూర్య గ్రహణాలు : శ్రీ విరోధి నామ సంవత్సరం, ఆషాఢ అమావాస్య బుధవారం అనగా తేదీ 22-7-2009 పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో ఉ.5-39 గంటలకు కేతు గ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది. మోక్షకాలం ఉ. 7-21. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వారు, కర్కాటక రాశివారు చూడరాదు.
శ్రీ విరోధి నామ సంవత్సరం పుష్య అమావాస్య శుక్రవారం అనగా ది.15-1-2010 తేదీ ఉ.11-38 గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం. మోక్షకాలం మ.3-19. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారు ధనుస్సు, మకరరాశి వారు చూడరాదు.
చంద్ర గ్రహణం : శ్రీ విరోధి నామ సంవత్సరం పుష్య శుద్ధ పౌర్ణమి గురువారం అనగా తేదీ 31-12-2009 ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో రాత్రి 12-21గంటలకు కేతు గ్రస్త చంద్రగ్రహణం. మోక్షకాలం. రా.1-24. మృగశిర 3, 4పా, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల వారు, మిధునరాశి వారు చూడరాదు.
మీ రాశి ఫలాలు తెలుసుకొనేందుకు మీ రాశి గుర్తుపై క్లిక్ చేయండి!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|