'మిత్రుడు' రివ్యూ
కాలేజీ ప్రేమకథలు, మిస్టరీ థ్రిల్లర్లతో పరిశ్రమను ముంచెత్తున్న ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడో కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ వైపు చూడని పరిస్థితి ఇప్పుడు ఉంది. థియేటర్లకు దూరమవుతున్న ఈ వర్గం ఆడియెన్స్ ను మళ్లీ ఆకట్టుకోవాలంటే అగ్రహీరోలు స్టార్ చట్రం నుంచి, ఇమేజ్ గుప్పిట్లోంచి బయటకు రావాలి. యువతరం దర్శకులు సైతం మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ లతో ముందుకు రావాలి. స్టార్ హీరో బాలకృష్ణ సైతం ఒకప్పుడు ఫ్యామిలీ అడియెన్స్ మెచ్చే అంశాలు, గ్రామీణ ఇతివృత్తాలతోనే ఎన్నో హిట్లు ఇచ్చారు. ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత క్రమంగా మూలాలు విస్మరించే పరిస్థితి వల్ల ఫ్లాపుల బారిన పడ్డారు. సమరసింహారెడ్డి...నరసింహనాయుడు..వంటి సెన్సేషన్ హిట్ల తర్వాత నేలవిడిచి సాము చేసి 'ఒక్కమగాడు'తో ఆయన దాదాపు దారితప్పారు. ఓపినింగ్స్ కూడా కరవయ్యాయి. పోయిన చోటే వెతుక్కోవాలని అనుకోవడం ఎప్పుడూ తెలివైన పనే. బాలకృష్ణ 'మిత్రుడు' చిత్రంతో అలాంటి ప్రయత్నమే చేశారు. ఎక్కడా ఓవర్ యాక్షన్ కనిపించదు...పేజీలకు పేజీలు దూకుడు డైలాగ్ లూ లేవు. చావుకు కూడా భయపడని డైనమిజం, ప్రేమ కోసం వెంటపడిన అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించ గలిగే మనస్థత్వం, ఫ్యామిలీ అటాచ్ మెంట్స్, హ్యూమరిజం...వంటి వివిధ పార్శ్వాలను హీరో పాత్ర టచ్ చేసింది. బహుశా ఇటీవల కాలంలో బాలకృష్ణ ఇన్ని కోణాలున్న పాత్రను చేయకపోవడమే ఆయన వైఫల్యాలకు కారణమని అనుకోవచ్చు. ఎక్కడా ఆయన పాత్రలో ఓవర్ యాక్షన్ లేకుండా, ఎక్కడా అండర్ ప్లే చేయకుండా బాలకృష్ణ పాత్రను చివరివరకూ బ్యాలెన్స్ గా నడిపించడంలో దర్శకుడు మహాదేవ్ పడిన తపన కనపడుతుంది. రాజమౌళి శిష్యుడైన మహాదేవ్ కు ఇది తొలి చిత్రమే అయినా ఎక్కడా అనుభవరాహిత్యం కనిపించదు. సస్పెన్స్ ఉన్న చోట సీన్ కట్ చేసి...సందర్భం వచ్చిన చోట పాత సన్నివేశాన్నిరీప్లే చేసి సందేహ నివృత్తి చేయడం ద్వారా దర్శకుడు మంచి స్క్రీన్ ప్లే పనితనమూ కనబరచారు. ఇవాల్డి జనరేషన్ లో కూడా జాతకాల చుట్టూ కథలు అల్లడమేమిటని అనుకోవడం సహజం. అయితే పెట్టిలో బంధించబడిన ప్రేతాత్మ బయటకు వచ్చి స్వైరవివాహం చేస్తే...ఇంకా ఇలాంటి నమ్మకాలేమిటని అన్న వాళ్లు కూడా 'అరుంధతి' చిత్రాన్ని ఆదరించిన విషయం మరిచిపోరాదు. చెప్పిందే మళ్లీ చెప్పినా...చెప్పగలిగేలా చెబితే చెప్పించుకోవడానికి ప్రేక్షకులు సిద్ధమే. 'మిత్రుడు' కథాంశానికి కూడా ఇది అన్వయించుకోవచ్చు. ఇంతకూ...'మిత్రుడు' నడక ఎలా సాగిందనే ముచ్చట్లోకి వెళితే...
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|