'రైడ్' రివ్యూ
యూత్ లోని స్పీడ్ కూ బైక్ రైడింగ్ కూ అవినాభావ సంబంధం ఉంది. లక్ష్యాలు నిర్దేశించుకుని సాధించడం యువత ప్రత్యేకత. ఇవాల్టి యువత ఏదైనా సాధించాలనుకుంటే పక్క వాళ్లను మోసం చేసి వాటిని పొందాలనుకోవడం లేదు. ఏ వయసుకు ఆ ముచ్చట అన్నట్టు వయసు ఉడిగిన వాళ్లకు బైక్ మీద మోజుండకపోవచ్చు కానీ బైక్ ఉండాలని ఆశించని కుర్రకారు ఉండరు. బైక్ ను సాధించుకున్నట్టే బైక్ మీద ఎక్కి తిప్పిందుకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలనుకోవడం వయసు మాయాజాలమే కదా. 'నాకు బైకూ కావాలి...ఎక్కించి తిప్పేందుకు గర్ల్ ఫ్రెండూ కావాలి' అంటున్నారు. ఇందుకు గట్స్ తో పాటు తగినంత కమిట్ మెంట్ కూడా ఉండాలి. బాధ్యతలను కూడా గుర్తెరిగి ఉండాలి. అప్పుడే కెరీర్ రైడ్ స్పీడ్ బేకర్లు లేకుండా సాఫీగా నడిచిపోతుంది. బైక్ మిస్సింగ్ (బైక్ మాయమవడం) కథాంశాలతో తెలుగులో పెద్దగా సినిమాలు రాలేదు. 'తొలివలపు' చిత్రంలో హీరో గోపీచంద్ తన బైక్ పోగొట్టుకుంటారు. ఆ పాయింట్ చుట్టూనే కథ నడిచినా ఫ్యామిలీ జనర్ కు చెందిన కథావస్తువది. ఇప్పుడు పాయింట్ అదే అయినా యూత్ ఫుల్ కథాంశంగా 'రైడ్' చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ ప్రేక్షకుల ముదుకు తెచ్చారు. తమిళ 'పొల్లాదావన్'కు ఇది ఫ్రీమేక్ అనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. ఒరిజనల్ వెర్షన్ రీమేక్ రైట్స్ తో జెమినీ సంస్థ ఇప్పటికే వరుణ్ సందేష్ తో 'బైక్' ('కుర్రాడు' కూడా కావచ్చు) అనే సినిమా తీస్తోంది. ఈ రెండు చిత్రాల మధ్యా కొన్ని సన్నివేశాలలో పోలిక అత్యంత సహజమే అయినా...రమేష్ వర్మ తన 'రైడ్'ను కొంత తిరగరాసుకున్నట్టు కనిపిస్తుంది. ఒక బైక్ చుట్టూ ఇద్దరు హీరోలు, వారి ప్రేమ జంటలు, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ముప్పేటగా ముడివేసి 'రైడ్'ను రెడీ చేశారు. కోరికలు, పట్టుదలలు ఉన్నట్లే కుటుంబం పట్ల బాధ్యతలు అవసరమని చెప్పడం ద్వారా యూత్ నూ, లైఫంటే లెక్కలు కాదు..పిల్లలు అని తల్లిదండ్రులు గుర్తెరగాలని చెప్పడం ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం రమేష్ వర్మ చేశారు. 'రైడ్' జోరు ఎలా సాగిందంటే...
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|