'వెంగమాంబ' రివ్యూ
'అన్నమయ్య' ఇంటింటా బహుళ ప్రచారంలో ఉన్న పద కవితా పితామహుడు. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తాగ్రగణ్యుడు. స్వామి అనుగ్రహ ప్రసాదంతో అవతరించి ఆయన సేవలో తరించారు. కలియుగంలో శ్రీవారి శోభ ఉన్నంతవరకూ తరగని చిరకీర్తి అన్నమయ్య సొంతం. ఆయన చరిత్రను 'అన్నమయ్య' చిత్రంతో దశదిశలా చాటిన కళాపిపాసి నిర్మాత దొరస్వామి రాజు. 'అన్నమయ్య' తర్వాత స్వామినే తన వాడిగా భావించి ఆయన సేవకే తన జీవితాన్ని అంకింతం చేసిన పద కవితల శారదాంబ వెంగమాంబ. ప్రజల్లో నానాటికీ పెరిగిపోతున్నస్వార్థం, అంధ విశ్వాసాలపై తిరుగుబాటు బావుటా వెగురవేసిన సంఘ సంస్కర్త. స్వామి ప్రత్యక్షమై జరామరణాలు లేకుండా నిత్య యవ్వనవతిగా ఉండే వరం ఇస్తానని చెప్పినా స్వామి సేవ మినహా తుచ్ఛమైన వాంఛలకు తావులేదని నిరాకరించిన ధన్యజీవి. పద్మావతి దేవి అంశా రూపంలో జన్మించి కవయిత్రిగా 'నృసింహ శతకం', 'విష్ణు పారిజాతం', 'వేంకటాచల మహాత్మ్యం' వంటి ఎన్నో రచనలు చేసిన అపర సరస్వతి. అన్నింటికీ మించి శ్రీవారి పవళింపు సేవకు 'ముత్యాల హారతి'ని అందించి ఆ హారతిని నేటికీ ఆనువంశికం చేసిన సాధ్వి.
సంఘ సంస్కరణాభిలాషి కావడమనేది ఆమెలోని మరో కోణం. పుట్టుకతోనే స్త్రీకి సంక్రమించిన బొట్టు, పూవులు, గాజులు వంటి వాటిని వైధవ్యం పేరుతో తీసివేయడం ఎందుకు? భర్త పోయినందుకు గుర్తుగా ఆడదానికి శిరోముండనం చేసే సమాజం అదే భార్య పోతే భర్తను ఎందుకు విధవగా అంగీకరించదు? స్త్రీలకే ఇలాంటి అర్ధరహితమైన కట్టుబాట్లు ఎందుకు? అని ప్రశ్నించి...అలాంటి సాంప్రదాయవాదులను తానే 'వెలి' వేస్తున్నానని చెప్పగలగిన ధీమంతురాలు. కారణాలు ఏవైనా అన్నమయ్యకు గురించి జనాలకు తెలిసినంత వెంగమాంబ గురించి తెలుసుండకపోవచ్చు. ఆ తెలియజెప్పే బాధ్యతను దొరస్వామి రాజు మరోసారి తన భుజస్కంథాలపై వేసుకుని 'వెంగమాంబ' చిత్రాన్ని సినీమాధ్యమం ద్వారా జనం ముందుకు తేవడం శ్లాఘనీయం. చిన్న ప్రయత్నమే అయినా చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నమిది. వెంగమాంబ చరిత్రకు అతిశయోక్తులు చొప్పించకుండా, పాత్ర ఔచిత్యానికి భంగం కలగకుండా తెరకెక్కించడంలో దర్శకుడు ఉదయ భాస్కర్ పడిన తపన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరుగుపడిన సమాచారం వెలిగితీసి...ఆలోచింపజేసే విధంగా ఆ అంశాలను ఆయన తెరకెక్కించారు. ఆ వివరాల్లోకి వెళితే...
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|