'లైఫ్ స్టైల్' రివ్యూ
ఇవాల్టి యువతరానికి సమయపాలన తెలిసినంతగా నిన్నటితరం వాళ్లకు తెలియదు. మార్పు అనేది ఎప్పుడూ ఆహ్వానించదగిన పరిణామమే. సాంకేతిక విప్లవం, పోటీ ప్రపంచం వీరిని మెరికల్లా తయారు చేస్తోంది. ఇదే సమయంలో మానసిక ఒత్తిడులు, కుటుంబ సంబంధాలు సన్నగిల్లుతుండటం వంటి ప్రతికూల పరిస్థితులను కూడా యువత ఎదుర్కొంటోంది. అయితే ఒకటి కావాలనుకున్నప్పుడు మరొకటి కోల్పోవడం అనేది పరిణామక్రమంలో భాగంగానే భావించాల్సి వస్తుంది. నేటి యువత కాలేజీ చదువుల రోజుల్లోనే తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ అందుకోసం అహరహం శ్రమిస్తున్నారు. తమ లక్ష్య సాధనలో పలు ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో కాలేజీ రోజుల నాటి స్నేహం, ప్రేమ, త్యాగం, కష్టాలు వంటివి తీపి జ్ఞాపకాలుగా పదిలంగా మిగుల్చుకోవడానికి యూత్ తహతహలాడుతోంది. కాలేజీ జీవితం, ఆ తర్వాత ఉద్యోగం, నచ్చిన జీవిత భాగస్వామితో జీవితం...ఇలా ప్రతీ దశలోనూ వారికంటూ ఓ 'లైఫ్ స్టైల్' ఏర్పరచుకుంటారు. సరిగ్గా ఇదే ఇతివృత్తంతో సీనియర్ డైరెక్టర్ ముప్పలనేని శివ తొలిసారి కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన యూత్ ఫుల్ కథాచిత్రమే 'లైఫ్ స్టైల్'. దర్శకుడుగా తనకున్న విశేషానుభవాన్ని ఉపయోగించి దాదాపు అంతా కొత్త నటులతో ముప్పలనేని శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆయన ఎంచుకున్న కథాంశం ఇటీవలే విడుదలైన 'హ్యాపీడేస్' కు దగ్గర పోలికలతో కనిపిస్తుంది. సుమంత్ 'క్లాస్ మేట్స్'నూ గుర్తుచేస్తుంది. అయితే దర్శకుడు తనకున్న అనుభవంతో కథలో ఫ్లో దెబ్బతినకుండా తగినన్ని ట్విస్టులతో కథను నడిపి సుఖాంతం చేశారు. 'లైఫ్ స్టైల్' నడక ఎలా సాగిందంటే...
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|