'శంఖం' రివ్యూ
దక్షిణాది సినీ పరిశ్రమ ఈమధ్యన జాతీయ అవార్డుల పరంగా బాలీవుడ్ ను తోసిరాజంది. ఇంత సంబరంలోనూ ఒకే లోటు...తెలుగు సినిమా జాడ కనిపించలేదని. జ్యూరీలో తెలుగు మెంబర్ లేరనీ, లాబీయింగ్ చేయలేదనీ ఎవరికి వారు స్వాంతన పొందే ప్రయత్నం మినహాయిస్తే...అసలు మన కృషిలోపం గురించిన ముచ్చటే లేదు. ఎంతసేపూ ఫార్ములా చట్టంలో బిగిసిపోయి హీరో బాడీ ల్వాంగేజ్ ను నమ్ముకుని సినిమాలు తీయడానికే మనం పరమితమవుతున్నాం. జనం ఒక సినిమాకి పట్టం కడితే అదే తరహా స్టీరియో టైప్ చిత్రాలు చుట్టేస్తూ జనాలకు విసిగెత్తేంతవరకూ అదే ట్రెండ్ లో కొట్టుకుపోవడమో తెలుగు సినిమాకి పరిపాటైంది. కొన్నాళ్లు లవ్, మరికొన్నాళ్ల ఫ్యాక్షన్, ఇంకొన్నాళ్లు థ్రిల్లర్స్, మరికొన్నాళ్లు హిస్టా(స్టీ)రికల్ ఫీవర్. అవసరం ఉన్నా లేకపోయినా కథ నేలవిడిచి ఫారెన్ లొకేషన్ల సాము చేయడం రివాజైపోయింది. పంటపొలాల్లో పల్లవి మొదలైన పాట బ్యాంకాక్ లోనో, ఆస్ట్రేలియాలోనో ముగుస్తుంది. ఇదంతా క్వాలిటీ, రిచెనెస్ కోసమేనని నమ్మబలికినా రిచ్ గూడ్స్ కు అట్రాక్టివ్ బిజినెస్ జరుగుతుందన్న మార్కెట్ స్ట్రాటజీనే ప్రధాన కారణం. హీరో గోపీచంద్ కు ఉన్న మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ ఆయనకు ఇటీవల పలు సక్సెస్ లు తెచ్చిపెట్టింది. అయితే మూస చట్రంలో నుంచి ఆయనను బయటకు తెచ్చే (ఆయన బయటకు వచ్చే ) ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపించవు. 'బాడీలాంగ్వేజ్' చుట్టూనే కథలు పరిభ్రమిస్తున్నాయనడానికి తాజా నిదర్శనమే 'శంఖం'. ఫ్యాక్షన్ కక్షల వల్ల జనం నష్టపోతారనే సందేశం ఇమిడిన 'యజ్ఞం' సినిమాతో హీరోగా తొలి హిట్ సాధించిన గోపీచంద్ కొద్దిపాటి విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ ఫ్యాక్షన్ బాట పట్టారు. రాయలసీమ ఫ్యాక్షన్ కథాంశాలు కొద్దకాలం క్రితం వరకూ టాలీవుడ్ ను మొత్తేశాయి. ఇటీవల జనం ఆ మాటే మరిచిపోయారనే గట్టి నమ్మకం కలిగిన తర్వాతే దర్శకుడు శివ మళ్లీ గోపీచంద్ తో సీమ 'శంఖం' పూరించారు. త్రిషను జోడించి గ్లామర్ లుక్ తెచ్చారు. ఆలీతో కామెడీ కిక్ ఇప్పించారు. ఎటొచ్చీ...హీరో-విలన్ మధ్య కీలకంగా ఉండాల్సిన (జనాలకు బాగా అలవాటు చేసిన ఫార్ములా) సంఘర్షణను మిస్సయ్యారు. పలచటి స్టోరీలైన్ తో రెండున్నర గంటల సేద్యం చేసే ప్రయత్నం చేశారు. ఆ ముచ్చట్లలోకి ఓసారి తొంగిచూస్తే...
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|