'గణేష్' రివ్యూ
ఒకప్పుడు హీరోలు కావడం కష్టంగా ఉండేది. అయితే ఒకసారి పేరు వచ్చిందా నిలబడిపోయేవారు. ఇప్పుడు హీరోలు కావడం ఈజీ. దాన్ని చివరి వరకూ నిలుపుకోవడమే కష్టం. జనరేషన్లు మారాడంతో ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులు వచ్చాయి. వినోద మాద్యమాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ట్రెడిషనల్ ఆడియెన్స్ గా చెప్పుకునే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వెళ్లడం తగ్గిపోయింది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే మాస్, ప్రేమకథలపై మనసు పారేసుకునే యూత్ ఇప్పుడు రాజపోషకులయ్యారు. అండర్ కరెంట్ గా సందేశం ఉండాలి కానీ సందేశం కోసమే సినిమా చూపిస్తామంటే యూత్ ఒప్పరు. దీంతో యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశాలనే ఫిల్మ్ మేకర్స్ ఎంచుకోవాల్సిన పరిస్థితి. పెద్దల్ని థియేటర్లకు రప్పించాలంటే చిన్న పిల్లల అంశాలు కూడా ఉండాలి. కథానాయకుడు ఎన్ని హీమాన్ ఫైట్స్ చేసినా హీరోయిన్ ముందు లవర్ బోయ్ అప్పీల్ ఒలకబోయాలి. ఇన్ని ఉండి...వినోదం లేకపోతే ప్రేక్షకుడు పెదవి విరిచేస్తాడు. ఈ కీలకమైన ఇన్ గ్రేడియంట్స్ జోడించుకుంటూ 'గణేష్' (జస్ట్ గణేష్) చిత్రాన్ని తొలి ప్రయత్నంగా దర్శకుడు శరవణన్ తెరకెక్కించారు. మొదట్నించీ ఈ సినిమా పబ్లిసిటీకి సాధ్యమైనంత దూరంగా ఉంచుతూ ఎలాంటి అంచనాలకు తావీయలేదు. 'రెడీ', 'మస్కా' చిత్రాలతో పిల్లల్ని సైతం తనవైపు తిప్పుకున్న హీరో రామ్ అదే పిల్లల నేపథ్యంలో 'సూపర్ మాన్' ఫీట్స్ చేస్తూనే ఆ పిల్లల్నే తన ప్రేమ వారధులుగా చేసుకోవడం ఈ సినిమా ప్లాట్. దర్శకుడు ఎంచుకున్న కథ నడక, మలుపులు, ముగింపు తేలిగ్గా ఊహించేయ వచ్చు. ఆపదల్లో ఆదుకునే దేవుడు గణేశుడైతే, ఇందులో హీరో పాత్ర కూడా అంతే. పేరు కూడా గణేషే. మరి 'జస్ట్' మాటో? హీరోకి వెనకా ముందు ఎవరూ ఉండరు. కులమతాలు లేకుండా అందరికీ సాయం చేస్తాడు కాబట్టి జస్ట్ గణేష్ అన్నమాట. దేవుళ్లలో వినోదం పంచే హీరో గణేష్ అయితే మన వెండితెర గణేష్ ఏ మేరకు ఎంటర్ టైన్ చేశాడో చూద్దాం...
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|