కామెడీ ఎవర్ గ్రీన్. ఇవాల్టి స్పీడ్ యుగంలో జనం నవ్వడం మరిచిపోతున్నారు. ఒకవేళ నవ్వినా పెదాల అంచులు దాటని నవ్వది. అది నవ్వా...నిర్వేదమా అనేది అర్ధంకాని ఓ బ్రహ్మ పదార్ధం. అందుకనే లాఫింగ్ క్లబ్ లకు అంత గిరాకీ. గుండె నిండుగా ఊపిరి నింపుకుని హాయిగా నవ్వగలిగితే దీర్ఘకాలిక వ్యాధులు కూడా మటుమాయం అవుతాయి. హాస్య బ్రహ్మ జంధ్యాల స్కూలు నుంచి వచ్చిన దర్శకుడు ఇవివి సత్యనారాయణ వెండితెరపై ఇంతవరకూ పండించిన నవ్వులు లెక్కవేయాలంటే కాలిక్యులేటర్లు కూడా తప్పుతాయోమో. అందుకే ఇవివి నుంచి ఓ సినిమా వస్తోందంటే జనం కాసుకుని కూర్చుంటారు. ఇవివి తనదైన శైలిలో కామెడీ సబ్జెక్ట్ ఎంచుకున్న చాలా సందర్భాల్లో జనం ఆయనను మెచ్చారు. తన స్టయిల్ కు భిన్నంగా వెళ్లినప్పుడు జనం తిప్పికొట్టారు. ఇ.వి.వి. యాదృచ్ఛికంగా అన్నారో...కాన్ఫిడెన్స్ తో అన్నారో కానీ జంధ్యాల వారి 'అహనా పెళ్లంట' చిత్రాన్ని తలపించేలా మా 'బెండు అప్పారావు...ఆర్ఎంపి' ఉంటుందని ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆసక్తికరంగా 'అహ నా పెళ్లంట' నిర్మాత డి.రామానాయుడే ఇప్పుడు 'బెండు అప్పారావు' నిర్మాత కూడా. 'ప్రేమఖైదీ' నుంచి ఇవివి-రామానాయుడు అనుబంధం కూడా ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ ఇద్దరి కాంబినేషన్ కు 'అల్లరి' నరేష్ తోడైతే సహజంగానే కాన్సెప్ట్...క్వాలిటీ...ఎంటర్ టైన్ మైంట్ ముప్పేటగా అల్లుకుంటాయనే అభిప్రాయానికి 'బెండు అప్పారావు' తావిచ్చింది. మరి ఆ అంచనాలు నిలబడ్డాయా? తినబోతూ రుచి ఎందుకు కానీ అప్పారావు సంగతులేవో ముచ్చటించుకుందా...