'విలేజ్ లో వినాయకుడు'రివ్యు
హీరోల ఇమేజ్ ను హిమాలయన్ హైట్స్ కు తీసుకు వెళ్తున్నామని చెప్పే పలువురు దర్శకులు వారిని స్మగర్లుగా, దోపిడీ దొంగలుగా, ప్రొఫెషనల్ కిల్లర్స్ గా చూపిస్తూ జబ్బలు చరుచుకోవడం పరిపాటి. ఇలాంటి దర్శకులంతా ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. హీరోలను ఉదాత్త పురుషులుగా చూపించకుంటే తప్పులేదు కానీ, అడ్డదారులు తొక్కయినా గొప్పవాళ్లయినట్టుగా చిత్రించి చివరకు సదరు హీరోలను ఓ మంచి పని చేసినట్టు చూపించి చేతులు దులుపేసుకుంటున్నారు. వీటిని చూసిన వారిలో అందరూ కాకపోయినా కొందరైనా 'ఈజీమనీ'కి దార్లు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో నిజాయితీగా సినిమా తీయాలనుకునే దర్శకులకు 'వినాయకుడు' ఓ లెసన్ అవుతుంది. 'ఎ బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ' అంటూ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. తొలి చిత్ర దర్శకుడుగా సాయికిరణ్ అడవి మరో నందిని ఎగరేసుకుపోయారు. చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నానికి అవార్డులు, రివార్డులు ఖాయమని నిరూపించిన చిత్రమది. స్థూలకాయుడైన ఓ యువకుడు తన మంచి మనసుతో ఓ అమ్మాయి హృదయాన్ని ఎలా గెలుచుకున్నాడనే సింపుల్ కథాంశం అది. ఆ చిత్రానికి సీక్వెల్ గా 'విలేజ్ లో వినాయకుడు' చిత్రాన్ని దర్శకుడు సాయికిరణ్ అడవి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అమ్మాయి మనసును గెలుచుకున్న కథానాయకుడు వారి పెద్దలను నేర్పుగా ఎలా ఒప్పించగలిగాడన్న పాయింట్ ఇది. ఒరిజనల్ చిత్రం (వినాయకుడు) పట్టణ నేపథ్యమైతే, ఈసారి గ్రామీణ నేపథ్యం. పాయింట్ మాత్రం హీరో స్థూలకాయం చుట్టూనే. కొత్త కథల కోసం హాలీవుడ్ సినిమాలు అరగదీసే బదులు కొంచెం మనసు పెడితే రియాలిటీకి దగ్గరగా ఉండే ఇలాంటి కథలను ఎన్నైనా రచయితలు సృష్టించవచ్చనడానికి ఇదో ఉదాహరణ. దర్శకుడుగా, మాటలు, స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా (మహితో కలిసి) ఇలా కీలక విభాగాలన్నీ భుజాన వేసుకున్న సాయికిరణ్ అడవి 'ఐడియాలో పెద్దది...బడ్జెట్ లో చిన్నది'గా 'విలేజ్ లో వినాయకుడు' చిత్రం తీసి ప్రీ-రిలీజ్ రికార్డులు కూడా సృష్టించారు. ఆడియో సేల్స్ పరంగా, ఈ ఏడాదిలోనే అతి తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రంగా, మీడియో పార్టనర్ల పరంగా వచ్చిన రికార్డులు ఇవి. ఇవన్నీ సహజంగానే ఈ చిత్రంపై మంచి అంచనాలను రేకెత్తించాయి. మరి ఆ అంచనాలకు ఫిల్మ్ మేకర్స్ ఏమేరకు రీచ్ అయ్యారో చూద్దాం...
Read 6 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|