'ప్రవరాఖ్యుడు' రివ్యూ
'ప్రవరాఖ్యుడు' గురించి తెలియని టీనేజర్స్ ఉండకపోవచ్చు. ఈ పదాన్ని పలకడం ఇబ్బందిగా అనిపించిన వాళ్లు 'ప్రవరాక్షసుడు' కూడా అంటుంటారు. అమ్మాయిల పేరు చెబితేనే ఆమడదూరం పారిపోయే కుర్రాళ్లను 'ప్రవరాఖ్యుడు' అనే నిక్ నేమ్ తో అమ్మాయిలు టీజ్ చేస్తుంటారు. ఓరకంగా చెప్పాలంటే తాను ప్రేమించకుండానే అమ్మాయిలను ఆకర్షించే వ్యక్తని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ఆధునిక ప్రవరాఖ్యుడు, స్వతంత్ర భావాలున్న వరూధిని క్యారెక్టర్లతో దర్శకుడు మదన్ 'ప్రవరాఖ్యుడు' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో, ముఖ్యంగా గృహిణులు, పెళ్లైన వర్కింగ్ లేడీస్ లో జగపతిబాబుకు ఉన్న ఫాలోయింగ్...ప్రియమణితో ఆయన కాంబినేషన్ కు 'పెళ్లైన కొత్తలో' చిత్రంతో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మదన్ చేసిన మరో ప్రయత్నమిది. జగపతిబాబు ఛార్మ్ ఇప్పుడు కాలేజీ గాళ్స్ కు కూడా విస్తరిస్తుందా అనేది టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి అందర్నీ ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. మదన్ తీసిన 'పెళ్లైన కొత్తలో' చిత్రానికి అమెరికా డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించిన 'టాలీ 2 హాలీ' సంస్థ జగపతి-ప్రియమణి-మదన్ త్రయంతోనే సొంతంగా 'ప్రవరాఖ్యుడు' చిత్రాన్ని నిర్మించడం కూడా క్యూరియాసిటీని పెంచింది. ఫ్యామిలీ అడియెన్స్ థియేటర్లకు రావడం మానేశారని అలిగి పక్కా మాస్ చిత్రాల వైపు మళ్లిన జగపతిబాబు మళ్లీ తన ఫేవరెట్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు, కొత్తగా టీనేజ్ గాళ్స్ కు చేరువయ్యేందుకు చేసిన ఈ ప్రయత్నం ఎలా సాగిందో చూద్దాం...
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|