'సలీమ్' రివ్యూ
శరత్ సృష్టించిన 'దేవదాసు', ఏళ్ల నాటి సలీమ్ ప్రేమ గాథ తెలియని వారుండకపోవచ్చు. ఇద్దరివీ విఫల ప్రేమలే. విషాదాంత ముగింపులే. ఒకటి సాంఘిక నేపథ్యమైతే, మరొకటి చారిత్రక నేపథ్యం. నాటి కట్టుబాట్లు, అంతస్తుల తారతమ్యాలే వారి ప్రేమకి అడ్డుగోడలుగా నిలిచాయని చరిత్ర చెబుతుంది. కట్ చేస్తే...21వ శతాబ్దంలో దేవదాసు, సలీమ్ లు కోరుకున్న ప్రేమను దక్కించుకోలేనంత పిరికి వాళ్లు కాదు. ప్రేమలో ఎంత డీప్ గా మునగగలరో అంతే తేలిగ్గా సాహసాలు చేసయినా తమ ప్రేయసిని దక్కించుకుని పైకి తేలగలరు. తమ ప్రేమను విఫలం చేసేందుకు ప్రేయసిని ఖండాంతరాలకు పట్టుకుపోతే ఆగమేఘాల మీద అక్కడకు చేరుకుని ఆమెను దక్కించుకోవడం నేటి 'దేవదాసు' స్టయిల్. దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి ఈ ఫార్ములాను బాగా ఒంటపట్టించుకుని మోడ్రన్ 'దేవదాసు'ను తెరపైకి తేస్తే జనం విరగబడి చూశారు. ఇప్పుడు 'సలీమ్' వంతు వచ్చింది. మళ్లీ సేమ్ ఫార్ములా. కాకపోతే నిన్నటి 'దేవదాసు' తన ప్రేయసి కోసం అమెరికా చుట్టొస్తే, ఇవాల్టి 'సలీమ్' ఇంకో అడుగు ముందుకు వేసి బ్యాంకాక్, యూరప్ వంటి పలు దేశాలు చుట్టేస్తాడు. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగిన సలీమ్ అనుకోకుండా ఓ అమ్మాయిని చూసి ఆమె కోసం ఇండియా వచ్చి అక్కడి కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, ప్రేమ మాధుర్యాన్ని అవగాహన చేసుకుని...తనలాగే పాశ్చాత్య సంస్కృతి మోజులో ఉన్న ఆ అమ్మాయికి కనువిప్పు కలిగించి ఆమెకు చేరువవుతాడు. వెస్ట్రన్ కల్చర్ కంటే భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని వైవిఎస్ చెప్పాలనుకోవడం అర్ధవంతమే. అయితే ఇదే వెస్ట్రన్ స్టయిల్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఆడపాత్రల చేత 'అంగాంగ' ప్రదర్శనలు చేయించి...జానాబెత్తెడు కొలతలు వేసి...లెక్కలు మిక్కిలి 'ఫ్లాష్ బ్యాక్'లతో 'దుమ్ము దులుపుతాను'అంటూ ప్రేక్షకుల 'దమ్ము' (సత్తా...సహనం) కు పరీక్ష పెట్టారు. అది ఏ మేరకనేది విశ్లేషించుకుంటే....
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|