'అదుర్స్' రివ్యూ
కథ కావాలా...రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకు బోరు కొట్టని కంటెంట్ కావాలా అని అడిగితే సగటు ప్రేక్షకుడు రెండోవైపై మొగ్గుచూపుతారు. దర్శకుడు వి.వి.వినాయక్ మాస్ పల్స్ కు అనుగుణంగా సినిమాలు తీయడంలో నేర్పరి. స్పీడ్ టేకింగ్ ద్వారా ప్రేక్షకుడి మొదడుకు పనిపెట్టకుండా సునాయాసంగా తన పని చేసుకు వెళ్లిపోతాడు. రచయిత కోన వెంకట్, దర్శకుడు వి.వి.వినాయక్ కలిసి ఈసారి కథ కోసం ఎక్కువ సమయం తీసుకుని 'కవల పిల్లలు చిన్నప్పుడే వేరు కావడం...చివరకు కలవడం' అనే అరిగిపోయిన పాయింట్ ను భుజాన వేసుకున్నారు. కాకుంటే ట్రీట్ మెంట్ పరంగా దర్శకుడు కొద్దిపాటి వైవిధ్యం చూపించేందుకు ప్రయత్నం చేశారు. అదే ఈనాటి 'అదుర్స్'. కేవలం యాక్షన్ నే నమ్ముకుని...వినోదం మిస్సయితే జనం మెచ్చడం లేదని గ్రహించిన వినాయక్ ఇటీవల తన పంథాను మార్చుకుని శ్రీనువైట్ల రూట్లోకి వెళ్లారు. నిన్నటి 'కృష్ణ' ఇలా వచ్చి జనం మెప్పుపొందిందే. 'అదుర్స్'లో వినాయక్ మరో అడుగు ముందుకు వేసి మాస్ హీరో ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ తో ఒక పాత్రను పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ కు, మరో పాత్రను పూర్తిగా యాక్షన్ తో నింపి...ఎలాంటి అండర్ కరెంట్ సందేశాలు జోలికి వెళ్లకుండా కథను నడిపారు. సస్పెన్స్...సెంటిమెంట్ వంటి అంశాలను టచ్ చేయకుండా చతురత చూపారు. సంక్రాంతి సీజన్ ఎన్టీఆర్ కు అచ్చిరాదనే ఓ సెంటిమెంట్ ప్రచారంలో ఉన్నా 'ప్రత్యేక' వాదా(దు)ల ఆందోళనల ప్రభావం ఈ చిత్రాన్ని ఇదే సీజన్ కు నెట్టింది. విడుదల తేదీ పరంగా చివరి వరకూ సస్పెన్స్...బయట నుంచి వచ్చిన హెచ్చరికలు...కోర్టు జోక్యం వంటి పరిణామాల మధ్య 'అదుర్స్' థియేటర్లను టచ్ చేయడంతో సహజంగానే స్టార్ హీరోల సినిమాల కోసం కళ్లు కాయలు కాసినట్టు ఎదురు చూస్తున్న సినీగెయెర్స్, ఎన్టీఆర్ ను చూసి చాలాకాలమైందని బెంగ పెట్టుకున్న ఆయన అభిమానులతో 'భోగి' సందడి భారీ బాక్సాఫీస్ ఓపినింగ్స్ తో మొదలైంది. 'అదుర్స్' చిత్రం అంచనాలకు తగ్గట్టు అదిరిందా లేదా అనేది విశ్లేషిస్తే...
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|