'నమో వెంకటేశ' రివ్యూ
పోయిన చోటే వెతుక్కోమని చెప్పిన వాళ్లు వెతుకున్న చోటే ఫిక్స్ అయిపోమని కూడా చెప్పే ఉంటారు. దర్శకుడు శ్రీనువైట్ల ఈ సూత్రాన్ని బాగా జీర్ణించుకుని ఒక యాక్షన్ బేస్డ్ స్టోరీలైన్ అనుకుని దాని చుట్టూ కామెడీ పూత పూసి సక్సెస్ అవుతున్నారు. ఈ ఫార్ములా నుంచి ఆయన ఇంచ్ కూడా కదలని పరిస్థితి ఉంది. ఇది మొనాటనీ కాకుండా ఆయన మునుమందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. శ్రీనువైట్ల సినిమా అనగానే హీరో ఏదో ఒక సందర్భంలో తప్పతాగి పక్కవారిని చితగ్గొట్టడం, ఇబ్బడిముబ్బడిగా రొటీన్ స్టార్ కాస్ట్, ప్రతిసారి ఒక కమెడియన్ హీరో చేతిలో ఫూల్ అవడం వంటివన్నీ కామన్. సంక్రాంతి వంటకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన 'నమో వెంకటేశ' చిత్రంలోనూ ఇలాంటి ఇంగ్రేడియంట్స్ యథాతథంగా కనిపిస్తాయి. హీరో వెంకటేష్ కు పేరు తెచ్చిన 'పెళ్లికాని ప్రసాద్' క్యారెక్టర్ కు దగ్గరగా (కంటిన్యుటీగా) ఇందులోని ఆయన పాత్రను నడిపించడమూ కనిపిస్తుంది. ముందే చెప్పినట్టు శ్రీనువైట్ల తన బ్రాండ్ ఆఫ్ కామెడీకి పెట్టింది పేరు కావడం, వెంకటేష్ కు కామెడీ పండించడంలో ఉన్న ప్రత్యేక శైలి, ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన తొలి సినిమా కావడం సహజంగానే ప్రేక్షకులలో మంచి అంచనాలను కలిగించింది. దీనితోడు 'ఆడవారి మాటలకు...' చిత్రం తర్వాత వెంకటేష్ కాంబినేషన్ లో త్రిష నటించడం కూడా ఆ అంచనాలను పెంచింది. ఆమె హాట్...అతను కూల్...మధ్యలో ఫూల్ అంటూ పబ్లిసిటీ పరంగా క్యూరియాసిటీని పెంచిన 'నమో వెంకటేశ' నడక ఎలా సాగిందో చూద్దాం...
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|