'శంభో శివ శంభో' రివ్యూ
మంచి కథలు లేక మల్టీస్టారర్లు చేయడం లేదనే స్టార్ హీరోలకు కొదవ లేదు. నిజానికి తమ ఇమేజ్ కు తగ్గ కథలు రాయించుకునే హీరోలకు నిజంగానే మల్టీస్టారర్ చిత్రాల్లో చేయాలనే మనసుంటే తగిన మర్గమూ ఉంటుంది. బాలీవుడ్ ఎప్పుడో మల్టీస్టార్ కు షిఫ్ట్ అయి గణనీయమైన హిట్లు, రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పడిప్పుడే తెలుగులోనూ ఈ ట్రెండ్ ప్రారంభం కావడం, సంక్రాంతి సీజన్ కు ఏకంగా రెండు మల్టీస్టారర్ చిత్రాలు రావడం శుభపరిణామంగానే చెప్పాలి. గత ఏడాది చిన్న చిత్రంగా మొదలై భారీ చిత్రాల స్థాయిలో రికార్డు కలెక్షన్లు సృష్టించిన తమిళ 'నాడోడిగల్' చిత్రానికి రీమేక్ గా మల్టీస్టారర్ తో 'శంభో శివ శంభో' తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒరిజనల్ వెర్షన్ దర్శకుడు సముద్ర ఖని ఈ చిత్రం ద్వారా తెలుగులోనూ పరిచయం కావడం, రవితేజ-అల్లరి నరేష్ తొలి కాంబినేషన్ కావడంతో సహజంగానే ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనే క్యూరియాసిటీకి తావిచ్చింది. నిజానికి ప్రేమ, స్నేహం, త్యాగం వంటి అంశాలను విడివిడిగా, కలగలిపి తీసిన చిత్రాలు ఏ భాషలోనైనా కుప్పలు తెప్పలుగానే వచ్చాయి. 'శంభో శివ శంభో' చిత్రం కూడా ఈ మూడు అంశాలను ముప్పేటగా అల్లుకున్న కథాంశమే. కాకుంటే మరికొంత డెప్త్ లోకి వెళ్లి ఇంతవరకూ చర్చకు రాని మరో పాయింట్ ను కూడా స్పృశించింది. చిక్కుల్లో పడిన ప్రేమికులను కలపాలనుకునే స్నేహితులు మనకు కొత్త కాదు. ఇలాంటి సందర్భాల్లోనే 'తల్లిదండ్రులు కొన్నే ఇస్తారు...స్నేహితుడు అన్నీ ఇస్తాడు' అని వీరు సగర్వంగా చాటుకుంటారు. పెద్దలు ఇష్టపడని ప్రేమజంటలను కలిపే సందర్భాల్లో ఒక్కోసారి వీరు ఎన్నో కోల్పోవలసి రావచ్చు. రిస్క్ లోనూ పడొచ్చు. అయితే తాము కలిపిన జంట సుఖం ముందు తమ కష్టం ఏపాటిదని వారు తృప్తి పడుతుంటారు. స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్న ఆ జంట...అనుకోని విధంగా ఆ తర్వాత నాలుగు రోజులకే ఇగోలతో విడిపోతే ఆ స్నేహితుల పరిస్థితి ఏమిటి? వారు కోల్పోయిన జీవితం మళ్లీ తిరిగొస్తుందా? పెళ్లి చేయడానికి హక్కున్న స్నేహితులకు విడిపోయిన ప్రేమజంటను ప్రశ్నించే హక్కుండదా?...ఇవి 'శంభో శివ శంభో'లో చర్చనీయాంశాలు. ఈ ముచ్చట్లలోకి ఓసారి వెళితే...
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|