'లీడర్' రివ్యూ
ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టయిల్ ఉంటుంది. ఆ స్టయిల్ తోనై ఎవరైనా ఎస్టాబ్లిష్ అవుతారు. 'ఆనంద్', 'గోదావరి' తన కూతుళ్లు లాంటి సినిమాలనీ, 'హ్యాపీడేస్' తన కొడుకులాంటి సినిమా అనీ చెబుతూ ముచ్చటగా మూడు 'బ్రెయిన్ చైల్డ్స్'ను అందించిన శేఖర్ కమ్ముల
ఇటు యూత్ నూ, ఇటు క్లాస్ నూ తన ఖాతాలో వేసుకున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్లు తనకు 'సేఫ్ జోన్' అనిపించుకున్నారు. తొలిసారిగా ఆయన తన జోన్ నుంచి బయటకు వచ్చి ఒక శంకర్ లా, మరో మణిరత్నంలా రాజకీయాలు, అవినీతి వంటి అంశాలతో కూడిన హెవీ సబ్జెక్ట్ ను 'లీడర్'తో తలకెత్తుతున్నారు. అవినీతి, అభివృద్ధి ఒక చోట మనలేవనీ, స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు పైబడినా అభివృద్ధి చెందిన దేశంగా మారలేకపోవడానికి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, భ్రష్టుపట్టిన పొల్టీషియన్లే కారణమని, అవినీతిని అంతం చేసి, కులవ్యవస్థను నిర్మూలించి, అంటరానితాన్ని కూకటి వేళ్లతో పెకిలించి గలిగిన నాడే సమాజానికి ఒక బాధ్యతాయుతమైన సందేశం ఇవ్వగలుగుతామనీ, అలా చేసిన వాడే నిజమైన 'లీడర్' అని శేఖర్ కమ్ముల ఈ చిత్రంతో చెప్పదలచుకున్నారు. షరా మామూలుగానే 'లీడర్'ను తన తల్లితో పోల్చారు. సినిమాలు చూసి వ్యవస్థ మారుతుందా అనడిగేవారి కోసమే అన్నట్టు తొమ్మిది కోట్ల మంది ప్రజలలో కొంతమందినైనా మార్చగలిగితే నా ప్రయత్నం ఫలించినట్టే అని నిబద్ధతతో ఆయన చెప్పుకున్నారు. ప్రత్యర్థుల కుట్రలో ప్రాణాలు కోల్పోయిన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కుమారుడు ముఖ్యమంత్రి కావడమనే పాయింట్ చుట్టూనే 'లీడర్' కథను ఆయన అల్లుకున్నారు. ఇందులోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావని అన్నప్పటికీ ఇటీవల వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదనలు ఊపందుకోవడం, దీనిపై సదరు పార్టీ నాయకుల్లో విభేదాలు తలెత్తడం వంటివి జ్ఞప్తికి వస్తాయి. అయితే వైఎస్ హఠాన్మరణానికి ముందే శేఖర్ కమ్ముల ఈ కథను రాసుకున్నారనేది నిర్వివాదాంశం. బేసిక్ స్టోరీలైన్ ఇదే అయినా చుండూరు దళితలపై జరిగిన దాడులు, లుంబిని బాంబ్ బ్లాస్ట్ లు, అయేషా మీరా కేసు వంటి అంశాలను కథాగమనానికి వాడుకోవడం ద్వారా రియలస్టిక్ ఎప్రోచ్ ను దర్శకుడు అనుసరించారు. క్లిప్పింగ్ లు చూపకుండా సన్నివేశాలు అల్లుకోవడం ద్వారా శేఖర్ తాను మంచి స్టోరీ టెల్లర్ అనిపించుకున్నారు. అయితే ఒక పొలిటికల్ డ్రామా అనగానే అందులో తగినంత ఫోర్స్, పవర్ అవసరం. హీరో పాత్రను హైలైట్ చేసినప్పుడు క్యారెక్టరైజేషన్ బలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు విషయాల్లోనూ శేఖర్ కమ్ముల తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. అదెలా? 'లీడర్'లో నాయకత్వ లక్షణాలు, జనాల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించే అవకాశాలు ఏమేరకు ఉన్నాయనేది ఓసారి చూద్దాం.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|