 మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా)
ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగ్గా ఉంటుంది. రుణ ఒత్తిడుల నుంచి బయట పడతారు. అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. శత్రువులు కుడా మిత్రులుగా మారతారు. బంధువులనుండి ముఖ్య సమాచారం అందుతుంది. ఆహ్వానాలు, గ్రీటింగ్ లు అందుతాయి. కాంట్రాక్టులు, ప్రాజెక్టు పనులను సైతం దక్కించుకుంటారు. అరుదైన పురస్కారాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగల సూచనలు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే సూచనలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.
14, 15 తేదీలలో శుభవార్తలు, ధన, వస్తులాభాలు. 17, 18 తేదీలలో వివాదాలు, ధననష్టం, కుటుంబసమస్యలు. |