TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

I vAraM rASi falAlu 14-3-2010 nuMDi 20-3-2010 varaku

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా) ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగ్గా ఉంటుంది. రుణ ఒత్తిడుల నుంచి బయట పడతారు. అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. శత్రువులు కుడా మిత్రులుగా మారతారు. బంధువులనుండి ముఖ్య సమాచారం అందుతుంది. ఆహ్వానాలు, గ్రీటింగ్ లు అందుతాయి. కాంట్రాక్టులు, ప్రాజెక్టు పనులను సైతం దక్కించుకుంటారు. అరుదైన పురస్కారాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగల సూచనలు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే సూచనలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి. 14, 15 తేదీలలో శుభవార్తలు, ధన, వస్తులాభాలు. 17, 18 తేదీలలో వివాదాలు, ధననష్టం, కుటుంబసమస్యలు.


వృషభం (కృత్తిక 2, 3, 4పా, రోహిణి, మృగశిర 1, 2పా) ఈవారం ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉండదు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. అనుకున్నది సాధిస్తారు. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. చర్చలు ఫలప్రదమవుతాయి. కుటుంబ విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు ప్రోత్సాకరంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. సంగీతం, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. 15, 16 తేదీలలో వృధా ఖర్చులు, మనశ్శాంతి లోపిస్తుంది. 18, 19 తేదీలలో విందు, వినోదాలు, వాహనయోగం.


మిథునం (మృగశిర 3, 4పా, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా) ఈవారం ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. బంధువుల తోడ్పాటు పరిపూర్ణంగా అందుతుంది. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. శత్రువులు మీదారికి వస్తారు. మీ కృషి ఫలిస్తుంది. కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పోగొట్టుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆహ్వానాలు, గ్రీటింగ్ లు అందుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. 15, 16 తేదీలలో దూరప్రయాణాలు, ఆరోగ్యభంగం, చికాకులు. 19, 20 తేదీలలో ధన, వస్తులాభాలు, ప్రముఖులతో పరిచయాలు.


కర్కాటకం (పునర్వసు 4పా, పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బాధ్యతలు అధికమవుతాయి. శ్రమాధికంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అవకాశాలు కొన్ని చేజారి నిరాశ చెందుతారు. బంధువులతో అకారణ వైరం. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. సంబంధబాంధవ్యాలు దెబ్బతింటాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. విలువైన వస్తువులు భద్రంగా కాపాడుకోండి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. ఆలయాలు సందర్శిస్తారు. కొందరి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. షేర్ల విక్రయాలు అంతగా లాభించవు. 15, 16 తేదీలలో రుణబాధలు, ధనవ్యయం. 18, 19 తేదీలలో విందు, వినోదాలు, కుటుంబసౌఖ్యం.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా) ఈవారం ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. భవిష్యత్ పై కాస్త ఆందోళన చెందుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలలో సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఊహించని రీతిలో విదేశీ పర్యటనలు. షేర్లవిక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి. పాత సంఘటనలు నెమరువేసుకుంటారు. 15, 16 తేదీలలో విందు, వినోదాలు, కొత్త బాధ్యతలు చేపడతారు. 18, 19 తేదీలలో ధనవ్యయం, ఒప్పందాలు రద్దు.


కన్య (ఉత్తర 2, 3, 4పా, హస్త, చిత్త 1, 2, 3పా) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. దూరప్రాంతాలనుండి శుభవార్తలు వింటారు. సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలుంటాయి. అనుకున్నది సాధిస్తారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి కలసివచ్చేకాలం. మీ ఊహలను నిజం చేసుకుంటారు. పరిశోధనలు ఫలితాలు ఇస్తాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. 15, 16 తేదీలలో ధనవ్యయం, చికాకులు. 18, 19 తేదీలలో ఆకస్మిక ధనలాభం, విలాసజీవనం సాగిస్తారు.


తుల (చిత్త 4పా, స్వాతి, విశాఖ 1, 2, 3పా) కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. వ్యవహారాలలో కాస్త ముందడుగు వేస్తారు. రుణ బాధలు తొలగుతాయి. వివాదాలు పరిష్కరించుకునేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. సమాజసేవలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ, వాహనయోగాలు కలిగే అవకాశముంటుంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. షేర్ల విక్రయాలలో అంతగా లాభాలు దక్కవు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. 14, 15 తేదీలలో వృధాఖర్చులు, శ్రమాధికం. 17, 18 తేదీలలో శుభవార్తలు, కీలక నిర్ణయాలు.


వృశ్చికం (విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక లావాదేవీలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రయాణాలు ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. కొన్ని అవకాశాలు చేజారతాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. పారిశ్రామిక, సాంకేతిక రంగాలవారికి యోగదాయకంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. మీ అంచనాలు నిజమవుతాయి. 16, 17 తేదీలలో ఊహించని ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు. 19, 20 తేదీలలో శుభవర్తమానాలు, పనులు పూర్తి.


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా) ఈవారం ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. భవిష్యత్ పై కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో చర్చలు జరుపుతారు. ఓర్పు, నేర్పుతో ముందుకు సాగుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. దూరపుబంధువులతో సఖ్యత నెలకొంటుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి అన్ని విధాలా అనుకూలం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. 15, 16 తేదీలలో వ్యయప్రయాసలు, ఖర్చులు. 18, 19 తేదీలలో ధనలబ్ధి.


మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2పా) ఈవారం ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలు ముందుకు కదలవు. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఎంతటివారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు రాగలవు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. షేర్ల విక్రయాలలో లాభాలు రాగలవు. 16, 17 తేదీలలో శుభవార్తలు, ఆర్థికాభివృద్ధి. 19, 20 తేదీలలో ఆరోగ్య, కుటుంబ సమస్యలు, వివాదాలు.


కుంభం (ధనిష్ఠ 3, 4పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3పా) నూతనోత్సాహంతో పనులు చేపడతారు. ఆర్థికలావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. పదవులు, హోదాలు లభిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్ లు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. షేర్ల విక్రయాలలో లాభాలు రాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 14, 15 తేదీలలో ధనలాభం, శుభకార్యాలలో పాల్గొంటారు. 17, 18 తేదీలలో నిర్ణయాలు వాయిదా, అనారోగ్యం.


మీనం (పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర, రేవతి) ఈవారం ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనుకోని ఖర్చులు. శ్రమాధికంతో పనులు పూర్తి చేస్తారు. బంధువులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సలహాలు పొందుతారు. ప్రత్యర్థులు మీపై పట్టుకోసం ప్రయత్నిస్తారు. కొందరి వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. ఆలోచనలు కలసిరావు. అనుకున్నది సాధించేందుకు కష్టపడతారు. ఇంటర్వ్యూలు నిరాశపరుస్తాయి. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగులకు స్థానచలన సూచనలు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు రాగలవు. 14, 15 తేదీలలో కుటుంబసౌఖ్యం, విలువైన సమాచారం. 18, 19 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు, వ్యయప్రయాసలు.

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2020 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training