'మగధీర' రివ్యూ
వాస్తవం కంటే కలలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. కలలు కనడమే కాదు...పండించుకోవడమూ తెలియాలి. హాలీవుడ్ సినిమాల స్థాయిలో మనం కనీసం ఒక్క సన్నివేశం కూడా తీయలేమనీ, గ్రాండియర్ లుక్ మనవల్ల కాదనీ, కనీసం కలలో కూడా అలాంటి సినిమాలు వస్తాయని కానీ తీస్తామని కానీ ఊహించలేమని అనే వాళ్లు... టెక్నాలజీ అందుబాటులో లేనప్పడే 'మాయాబజార్' వంటి కళాఖండాన్ని విజయా వారు అందించారని మరచిపోకూడదు. 'సింహాసనం' సెట్స్ ఈరోజుకూ కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. జనరేషన్లు మారాయి కదా...ఇప్పటి మాటేమిటి అనే వాళ్ల కోసం హాలీవుడ్ స్టయిల్ ఆఫ్ మేకింగ్ తో రిచ్ టెక్నాలజీ వాల్యూస్ తో తెలుగు ఫిల్మ్ మేకర్స్ ముందుకు వస్తుండటం ఇటీవల కాలంలో శుభ పరిణామం. నిన్నమొన్నటి 'అరుంధతి' ప్రేక్షకులను స్పెల్ బౌండ్ చేసింది. యాదృచ్ఛికమో...సంకల్పితమో కానీ 'అరుంధతి' స్మృతులు ఇంకా చెదరకుండానే ఆ సినిమాకి దగ్గర పోలికలతో పునర్జన్మల (రీబర్త్) కాన్సెప్ట్ తో 'మగధీర' ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. రీబర్త్, అఘోరా ఎపిసోడ్, విలన్ హీరోయిన్ ని కామించడం, బహిష్కృతుడైన విలన్ మళ్లీ తిరిగొచ్చి ప్రతీకారం రగిలిపోవడం వంటివి ఈ రెండు సినిమాల్లోనూ కామన్ పాయింట్లు. అందులో గద్వాల్ కోట..ఇందులో ఉదయ్ గఢ్ కోట. రెండూ పీరియాడిల్ నుంచి ఈ కాలం వరకూ సాగే ఇతివృత్తాలే. ఇంతవరకూ సక్సెస్ ల పరంగా మడంతిప్పని రాజమౌళి, హిందీ 'గజనీ'తో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన అల్లు అరవింద్, మెగాస్టార్ నటవారసుడిగా ఆయన వదిలి వెళ్లిన సింహాసనానికి యువరాజుగా గ్లోరిఫై అవుతున్న రామ్ చరణ్ కలిస్తే...అందులోనూ రాజమౌళి ఇంతవరకూ టచ్ చేయని రీబర్త్ అండ్ లవ్ కాన్సెప్ట్ తో పీరియాడిక్ సినిమా తీస్తే ఇక సంచలనాలకు కొదవేముంటింది? ఇదే అంచనాలతో 'ఇది మా సినిమా' అని హాలీవుడ్ గొప్పలు చెప్పుకునే వారికి ధీటుగా 'మగధీర' తెరకెక్కించాలనే ప్రయత్నం జరిగింది. అయితే ఎంతవరకూ సినీగోయెర్స్ దాహర్తిని తీర్తిందనే ముచ్చట్లలోకి వెళ్తే...
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4- -5-
|