'మగధీర' రివ్యూ
కథకు సరిగా కనెక్ట్ అయ్యే సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవిని చూపకపోవడం, పేలవమైన సన్నివేశం రాసుకోవడం సబబుగా తోచదు. చిరు-చిరుతల మధ్య సంభాషణ ఇలా సాగుతుంది. '1. ఈ పాపకు (ముమైత్) వెల్లిండ్ చేస్తున్నావా? ఏలేందు చిన్న టింకరింగ్ ఇస్తున్నాను గురువు గారూ...2.చాలా ఉందిరా నీ దగ్గర...నా బ్లడ్ లోనే ఉంది గురూ'. 3.ఓరి నా బచ్చా రఫ్పాడించావు గదరా'. ఇలా సాగే సంభాషణలు అభిమానులను అలరించేందుకు ఉద్దేశించినవే అయినా రామ్ చరణ్ ను హీరోగా సొతంగా ఎదగనిస్తే మంచింది. చిరంజీవి గెస్ట్ రోల్ ను దర్శక-సంభాషణా రచయితలు సమర్ధవంతంగా ఉపయోగించుకుని ఉండాల్సింది. కాజల్ ఇందులో గత చిత్రాల కంటే అందంగా కనిపించడమే గాకుండా మెరగైన నటన ప్రదర్శిచింది. శ్రీహరి షేర్ ఖాన్ పాత్రలో విజృభించాడు. ఆ పాత్ర హుందాతనం సాల్మన్ పాత్రలో కనిపించదు. విలన్ పాత్రలో దేవ్ గిల్ బాగానే నటించాడు. కాకుంటే సోనూసూద్ కు(అరుంధతి) అనుకరణలా ఆ పాత్ర నడిచింది. అఘోరాగా రావు రమేష్, రాజుగా శరత్ బాబు నటించారు. బ్రహ్మానందం, సునీల్ కామెడీ అంతంతమాత్రమే. ముమైత్ ఖాన్, కిమ్ శర్మ చెరో ఐటెం సాంగ్ లో నటించారు.
సాంకేతిక పరంగా దాదాపు అన్ని విభాగాల్లోనూ తగిన కష్టం కనపిస్తుంది. వారి కష్టానికి గుర్తుంపుగా సినిమా ముగింపు టైటిల్స్ లో ఒక సాంగ్ ను దర్శకుడు వారికి కేటాయించడం మెచ్చుకోలుగా ఉంది. 400 ఏళ్ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళాదర్శకుడు రవీందర్ మంచి ప్రతిభ కనబరచారు. ఉదయగఢ్ కోట, భైరవ కోన, కాలభైరవ విగ్రహం వంటివి అద్భుత దృశ్యావిష్కరణలా అనిపిస్తాయి. కీరవాణి సంగీతం అందించిన పాటల్లో 'మంచెకాడ బొమ్మ' పాట, గోల్గొండ అందాల చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. 'ధీర ధీర ధీర మనసాగలేదురా' పాట కూడా ఈ కోవలేనిదే. కల్యాణి మాలిక్ తో కలిసి కీరవాణి అందించిన బ్రౌక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఘట్టాల్లో అదరహో అనిపించుకుంటుంది. 100 మందిని కాలభైరవ ఊచకోత కోసే యాక్షన్ ఘట్టానికి పీటర్ హెయిన్స్ కంపోజిషన్ థ్రిల్ చేస్తుంది. హీరోహీరోయిన్లకు రమా రాజమౌళి స్టైలింగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎం.రత్నం సంభాషణల్లో పదను తక్కువ. కోటగిరి వెంకటేశ్వర ఎడిటింగ్ ఓకే. డిజిటల్ ఇంటర్మీడియట్ వర్క్ బాగుంది. అల్లు అరవింద్ నిర్మాణ విలువలు తెరపై ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4 -5-
|