'మగధీర' రివ్యూ
రాజమౌళి ఈ స్టోరీకి మూలం ఏమిటనే పాయింట్ తో కథ మొదలుపెట్టడం ద్వారా ప్రేక్షకులలో క్యూరియాసిటీని రేకెత్తించగలిగారు. మధ్యమధ్యలో పాత్రధారులకు గతం గుర్తుకొచ్చే ఎపిసోడ్స్ చూపించి...సందర్భోచితంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చొప్పించడం ద్వారా కథను పట్టుగా నడిపే ప్రయత్నం కొంతమేర చేశారు. ఎక్కడైతే కథ మొదలైందో అక్కడే క్లైమాక్స్ ఘట్టం నడపే చతురత సైతం ప్రదర్శించింది. అయితే సహజంగా కోరికలతో చనిపోతో ఆ కోరికే మరుజన్మకు దారితీసి అది తీర్చుకునే ప్రయత్నం జరుగుతుందంటారు. కాలభైరవ కోసం చివరి క్షణంలో కూడా కలవరించిన మిత్ర విందకు ఈ జన్మలో అతనెవరో గుర్తుకు రాదు. అయితే మనసులో ప్రేమున్నా మాటకు కట్టుబడి ఆమెకు దూరంగా ఉన్న కాలభైరవకు మాత్రం గత జన్మ స్మృతులు తెలిసిపోతాయి. ఆకాశంలో కనిపించే అష్టగ్రహ కూటమి తొలగిపోయేలోపు ఇందూకు పూర్వజన్మ గుర్తుకు రాకపోతే ఇక ఎప్పడికీ గుర్తురాదంటూ అఘోరా అనే మాంత్రికుడికి చేత చెప్పిస్తారు. ఏంటో ఈ లాజిక్. క్లైమాక్స్ ఘట్టంలో హీరో నేలను గట్టిగా తాకి అప్పుడు వదిలిసేన కత్తి బయటకు తీస్తాడు. అది అక్కడే ఉందని కూడా ఎంత జ్ఞాపకమో మరి? బైక్ రైడింగ్ మాత్రమే తెలిసిన హీరో గుర్రం కనబడగానే అనుభవజ్ఞుడులా నడిపేయడమూ వింతే.
హైద్రాబాద్-రాజస్థాన్ పక్కపక్కనే ఉన్నట్టు...హీరో ఇలా బెక్ ఎక్కి అలా ఎడారి ఇసుకలో కాలుపెట్టడం కన్విన్సింగ్ గా లేదు. పోరాట ఘట్టాల్లో జాకీచాన్ 'మిత్' సినిమా పోలికలూ కనిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఘట్టంలో కారులో టఫీమని శ్రీహరి వచ్చి వాలిపోతాడు. మంచి రసకందాయాంలో ఫైట్ ఉన్నప్పుడు హెలికాఫ్టర్ ను, శ్రీహరి కారు ఢీకొనే ఘట్టమూ పేలవమే. నాణేనికి మరో కోణం ఉన్నట్టే...ఫ్యాష్ బ్యాక్ పీరియాడిక్ ఎపిసోడ్స్ ను దర్శకుడు సమర్ధవంతగా నడిపించారని చెప్పొచ్చు. గ్రాండ్ సెట్టింగ్, ఏరియల్ వ్యూ నుంచి తీసిన షాట్లు, ఇసుకలో కూరుకుపోతున్న హీరోను గుర్రం కాపాడే ఘట్టం, ఆకాశంలోకి ఎక్కుపెట్టిన బాణాలకు డాలు అడ్డుపెట్టుకునే సన్నివేశం, బస్సులో వెళ్లిపోతున్న హీరోయిన్ ను హీరో గుర్రంపై ఛేజ్ చేసే సన్నివేశం ప్రేక్షకుల మెప్పుపొందుతాయి.
రామ్ చరణ్ తొలి చిత్రానికీ, రెండో చిత్రానికీ స్పష్టమైన తేడా ఉంది. 'చిరుత' చరణ్ ఎంత వరకూనటించగలడో తెలుసుకునేందుకు ఉపకరిస్తే, మలి చిత్రంలో అంతా తానే అయి విశ్వరూపం చూపించే అవకాశం దక్కింది. ఇప్పటికే డాన్లు, ఫైట్స్ లో తన సత్తా చాటుకున్న చరణ్ కు ఇందులోని పీరియాడిక్ పాత్ర నిజంగానే ఓ ఛాలెంజ్ గా నిలుస్తుంది. అనుభవజ్ఞలు మాత్రమే ఇలాంటి పాత్ర పోషణకు అంగీకరిస్తారు. ఓవైపు మెగాస్టార్ వారసత్వం, మరోవైపు సొంతంగా నిలదొక్కుకోవలసిన పరిస్థితి. దీనిని చరణ్ సమర్థవంతంగానే ఎదుర్కొన్నాడు. కాలభైరవ పాత్రకు చరణ్ చక్కటి బాడీలాంగ్వేజ్ తో న్యాయం చేశారు. ఇందుకు రమా రౌజమౌళి స్టైలింగ్ కూడా బాగా ఉపకరించింది. డైలాగ్స్ మాడ్యులేషన్ లో కూడా చరణ్ ఘనాపాఠి అనిపించుకున్నా...భాషలో తడబాటు ఉంది. మహారాణి అనే పదాన్ని మహారాణిగా, ఆధారపడడు అనే పదాన్ని ఆదారపడడుగా, పరువును పర్రువుగా పలకడం పంట్లో రాయే. ఛాలెంజింగ్ పాత్రలు మునుముందు మరిన్ని చేయగలనని చరణ్ ఈ చిత్రంతో స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. మెగాస్టార్ వారసుడిగా అందరికీ తెలుసు కాబట్టి ఇకనుంచి ఆయన పేరు, ఆయనను గుర్తు చేసే సంభాషణలు లేకుండా సొంత ఐడెంటిటీ సృష్టించుకోవడం కెరీర్ పరంగా మంచింది. చరణ్ ను నీపేరు అని విలన్ అడిగినప్పుడు 'చిరంజీవి' అని చెప్పడం 'ఐడెంటిటీ క్రైసిస్' అనుకోవడానికి ఆస్కార మిస్తుంది.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4- -5-
|